Site icon NTV Telugu

Hyderabad Drugs: అమెజాన్ కొరియర్‌లో డ్రగ్స్ కలకలం.. 2 కేజీల గంజాయి సీజ్!

Ganja

Ganja

2kg Ganja seized in Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ స్మగ్లింగ్ గుట్టు రట్టైంది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ కొరియర్ ద్వారా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను మేడ్చల్ ఎస్ఓటీ టీమ్ పట్టుకుంది. అక్రమంగా తరలిస్తున్న 2 కేజీల గంజాయిని రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లో పోలీసులు సీజ్ చేశారు. ముఠాపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌ నగరం గంజాయికి అడ్డాగా మారిన విషయం తెలిసిందే.

Also Read: Medak Parliament: మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో అభ్యర్థుల మధ్య ఫిర్యాదుల రాజకీయం!

ఒరిస్సా నుండి అమెజాన్ కొరియర్‌లో హైదరాబాద్‌కు గంజాయి పార్సిల్ అవుతున్నట్లు ఎస్ఓటీ పోలీసులకు సమాచారం వచ్చింది. పక్కా సమాచారంతో మాటు వేసిన ఎస్ఓటీ పోలీసులు.. మేడ్చల్‌లోని రేకులబావి చౌరస్తా వద్ద ఒరిస్సాకు చెందిన గిరిదారీని పట్టుకున్నారు. అమెజాన్ కొరియర్‌లోని 2 కేజీల గంజాయిని సీజ్ చేశారు. గిరిదారీతో పాటు తిరుమల్‌గిరికి చెందిన రోహిత్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్‌డీపీఎస్‌ యాక్ట్ కింద ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version