NTV Telugu Site icon

Cyber Frauds: బీ అలర్ట్.. ఇన్వెస్ట్మెంట్ పేరుతో దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు..

Cyber

Cyber

Cyber Frauds: గత కొంతకాలంగా అనేక చోట్ల ఇన్వెస్ట్మెంట్ పేరుతో దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతు కోట్ల రూపాయలు కోళ్లగొడుతున్నాయి ముఠాలు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కి చెందిన కొందరు బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేస్తున్నారు. ఈ ముఠాల కోసం ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు సైబర్ క్రైమ్ పోలీసుల బృందాలు వెళ్లాయి. సైబర్ ముఠాలకు అకౌంట్స్ సప్లయ్ చేస్తున్న వారితో పాటు అకౌంట్ హోల్డర్లలను సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Kishan Reddy: తెలంగాణ ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ..

ఈ ముఠాలకు సంబంధించిన కీలక నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసారు. దేశవ్యాప్తంగా మొత్తం 983 కేసుల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేసారు. గుజరాత్ లో స్పెషల్ ఆపరేషన్ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 36 మంది నిందితులను అరెస్టు చేసారు. అందులో ఏడుగురు సైబర్ క్రైమ్ కింగ్ పిన్స్ తో పాటు ఒక చార్టెడ్ అకౌంట్ ను కూడా అరెస్ట్ చేసారు. 11 ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ 4 ట్రేడింగ్ ఫ్రాడ్స్,4 ఫెడెక్స్ ఫ్రాడ్స్, కొరియర్ ఫ్రాడ్స్, నాలుగు కేవైసీ ఫ్రాడ్స్ లో వారిని అరెస్ట్ చేసారు.

HYDRA: తుమ్మిడి చెరువు మరోవైపు ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్న హైడ్రా..