Cyber Crime: హైదరాబాద్‌లో భారీ సైబర్ దోపిడీ.. ‘పిన్ సర్వే’ సంస్థ నుంచి రూ. 8 కోట్లు లూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ వేదికగా కార్పొరేట్ సంస్థలను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు సాగిస్తున్న దోపిడీలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా మాదాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ‘పిన్ సర్వే’ సంస్థను టార్గెట్ చేసిన హ్యాకర్లు, కేవలం గంట వ్యవధిలోనే ఏకంగా రూ. 8 కోట్లను కొల్లగొట్టారు. కంపెనీ బ్యాంకింగ్ నెట్వర్క్ భద్రతా లోపాలను ఆసరాగా చేసుకున్న సైబర్ కేటుగాళ్లు, కంపెనీ అధికారిక ఖాతాలను హ్యాక్ చేశారు. విషయం కంపెనీ ఆర్థిక విభాగానికి బోధపడేలోపే, కేవలం ఒక్క గంటలోనే ఈ మొత్తాన్ని వివిధ రాష్ట్రాల్లోని సుమారు 39 ‘మ్యూల్ అకౌంట్లకు’ మళ్లించారు. అనుమానాస్పద లావాదేవీలను గుర్తించిన యాజమాన్యం వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇటీవలే నగరంలోని ‘ఎన్బీసీ’ సంస్థ నుంచి కూడా ఇదే తరహాలో రూ. 8 కోట్లు కాజేసిన ఘటన మరువకముందే, మళ్లీ అదే స్థాయిలో దోపిడీ జరగడం అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. గతంలో నకిలీ ఈమెయిళ్లు, మాల్వేర్లు పంపడం ద్వారా పాస్వర్డ్లు చోరీ చేసి నిధులు మళ్లించిన దాఖలాలు ఉన్నాయి. పిన్ సర్వే సంస్థ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. డబ్బులు బదిలీ అయిన 39 బ్యాంకు ఖాతాలను తక్షణమే ఫ్రీజ్ చేయాలని బ్యాంకులను ఆదేశించారు. అలాగే హ్యాకింగ్‌కు వాడిన ఐపీ అడ్రస్‌లు, సర్వర్ రికార్డులను ఫోరెన్సిక్ టీమ్‌లు పరిశీలిస్తున్నాయి. అంతర్రాష్ట్ర లేదా విదేశీ సైబర్ ముఠాలు ఈ నేరానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు జరిపే కార్పొరేట్ సంస్థలే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. సైబర్ ముప్పుల నుండి తప్పించుకోవడానికి కంపెనీలు తమ సిస్టమ్స్‌లో మల్టీ-ఫ్యాక్టర్ అథెంటికేషన్, రోజూవారీ సెక్యూరిటీ ఆడిట్స్, భారీ బదిలీల సమయంలో డ్యుయల్ ధ్రువీకరణ వంటి భద్రతా పద్ధతులను తప్పక పాటించాలని హెచ్చరించారు.
Also Read
తాజావార్తలు
-
Cyber Crime: హైదరాబాద్‌లో భారీ సైబర్ దోపిడీ.. ‘పిన్ సర్వే’ సంస్థ నుంచి రూ. 8 కోట్లు లూటీ..
-
Ind Vs Pak: అండర్-19 ఆసియా కప్ 2026.. భారత్‌పై పాకిస్తాన్ థ్రిల్లింగ్ విక్టరీ..
-
Fire Accident: సీతాఫల్మండిలో టపాసుల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం
-
Maryam Nawaz: సీఎం వస్తున్నారని పరీక్షలాపేస్తారా? పాక్ సర్కార్ తీరుపై భగ్గుమన్న తల్లిదండ్రులు!
-
Team India: జట్టు నుంచి తప్పుకున్న పటీదార్.. వైస్ కెప్టెన్‌గా రింకూ సింగ్..
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!