Hyderabad Crime: రియల్ “కేరళ స్టోరీ”.. ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లిచేసుకొని ఇస్లాం మతంలోకి మారాలంటూ..!
- హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పరిధిలో షాకింగ్ ఘటన వెలుగులోకి
- ప్రేమ, పెళ్లి పేరుతో యువతిని నమ్మించిన నిందితుడు
- మత్తుమందు ఇచ్చి సామూహిక అత్యాచారం చేసినట్లు ఆరోపణ
- పెళ్లి తర్వాత బలవంతంగా మత మార్పిడి చేశాడని బాధితురాలి ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Crime: రోజురోజుకి సమాజంలో దారుణ ఘటనలు ఎక్కువతున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని కూకట్‌పల్లి పరిధిలో ఒక విస్తుపోయే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమ, పెళ్లి పేరుతో ఒక యువతిని నమ్మించి, అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, బలవంతంగా మత మార్పిడి చేసినట్లు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి.
Riyan Parag: మ్యాచ్ పోయిందనుకున్నాం.. ఆ ఇద్దరే దేవుడిలా వచ్చి కాపాడారు, ఈసారి గట్టిగా కొడతాం!
Also Read
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ నవాజ్ అనే వ్యక్తి సదరు హిందూ యువతిని ప్రేమ పేరుతో నమ్మించాడు. వివాహానికి ముందే జూలై 2025లో నవాజ్ ఆమెను బేగంపేటలోని తన గదికి పిలిపించాడు. అక్కడ ఆమెకు నీటిలో మత్తుమందు కలిపి స్పృహ కోల్పోయిన తర్వాత నవాజ్ తన సోదరులు, స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి (Gang Rape) పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
ఆ తర్వాత నిందితుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లి జరిగిన తర్వాత అసలు స్వరూపం బయటపడింది. నవాజ్ తనను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చాడని బాధితురాలు ఆరోపించింది. అంతేకాకుండా తనకు తెలియకుండానే నవాజ్ అప్పటికే మరో ఇద్దరు మహిళలను వివాహం చేసుకున్నాడని, తనను మోసం చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నిందితుడి వేధింపులు భరించలేక చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.
Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలెర్ట్.. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు..!
బాధితురాలి ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి పోలీసులు షేక్ నవాజ్, షేక్ మునావర్, ఇస్మాయిల్, షారుక్, ఇర్ఫాన్ అనే ఐదుగురిపై కేసు నమోదు చేశారు. అయితే ప్రధాన ఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరగడంతో కూకట్‌పల్లి పోలీసులు ప్రాథమికంగా ‘జీరో ఎఫ్ఐఆర్’ (Zero FIR) నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం కేసును బేగంపేట పోలీసులకు బదిలీ చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్నారు.
తాజావార్తలు
-
Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
-
OTR: ఉమ్మడి నల్గొండలో రెడ్డి ఆధిపత్యం? కాంగ్రెస్‌లో బీసీ నేతల అసంతృప్తి!
-
Common Pass : హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. మెట్రో, ఆర్టీసీకి ఒకే పాస్
-
Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
-
Flydubai Attack: విమానాన్ని కూల్చాలనుకున్న ఒమన్ పైలట్.. ఇజ్రాయిల్‌కు అప్పగింతపై ట్విస్ట్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?