Riyan Parag: మ్యాచ్ పోయిందనుకున్నాం.. ఆ ఇద్దరే దేవుడిలా వచ్చి కాపాడారు, ఈసారి గట్టిగా కొడతాం!
- గుజరాత్ టైటాన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ ఉత్కంఠ విజయం
- టైటాన్స్ విజయానికి చివరి 2 ఓవర్లలో 15 పరుగులు
- రాజస్థాన్‌కు ఊహించని విజయాన్ని అందించిన ఆర్చర్, తుషార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Riyan Parag Hails Archer and Deshpande: ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్‌పై సాధించిన ఉత్కంఠ భరిత విజయంపై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ స్పందించాడు. మ్యాచ్ ఒక దశలో తమ చేతిలో నుంచి జారిపోతుందని అనిపించిందని, కానీ చివరి ఓవర్లలో బౌలర్లు అద్భుతంగా రాణించడంతో విజయం సాధించగలిగామని తెలిపాడు. అంతా అయిపోయిందనుకున్న సమయంలో జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండేలు దేవుడిలా వచ్చి కాపాడారని పరాగ్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో బౌలర్లే హీరోలు అని రాయల్స్ కెప్టెన్ చెప్పుకొచ్చాడు. టైటాన్స్ విజయానికి చివరి 2 ఓవర్లలో 15 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆర్చర్, తుషార్ చెరో 4 పరుగులే ఇచ్చి రాజస్థాన్‌కు ఊహించని విజయాన్ని అందించారు.
మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ… ‘ఇది నిజంగా అద్భుతంగా అనిపించింది. ఒక దశలో నేను రిస్క్ తీసుకుందామని భావించాను. మా ఆటగాళ్లు ప్లాన్‌ను అద్భుతంగా అమలు చేశారు. నా గొంతు కూడా మారిపోయేంతగా నేను అరిచాను. ప్లేయర్స్ నేను అనుకున్న విధంగా ఆడినందుకు నాకు చాలా ఆనందంగా అనిపించింది. 19వ, 20వ ఓవర్లలో ఎవరు బౌలింగ్ చేయాలన్న విషయంలో నేను కాస్త అయోమయంలో ఉన్నా. ఆ సమయంలో 12 బంతుల్లో 15 పరుగులు అవసరమయ్యాయి. దూకుడుగా బౌలింగ్ చేయాలని అనుకున్నాను. అది సక్సెస్ అయితే బాగుంటుంది, లేదంటే తర్వాత మళ్లీ ప్రయత్నిస్తాం అనుకున్నాను. అయితే ధృవ్ జురెల్ వచ్చి అంతా సెట్ చేశాడు. 19వ ఓవర్‌ను ఆర్చర్‌కు ఇవ్వాలని సూచించాడు. అది సక్సెస్ అయింది’ అని చెప్పాడు.
Also Read
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
Also Read: Araku Valley Earthquake: అరకు లోయలో అర్ధరాత్రి భూ ప్రకంపనలు.. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీసిన జనాలు!
‘ధృవ్ జురెల్ ప్రతిభకు ఇప్పటివరకు పూర్తిగా న్యాయం జరగలేదని నాకు అనిపిస్తుంది. అతను 6వ, 7వ స్థానాల్లో బ్యాటింగ్ చేస్తూ కష్టమైన పాత్ర పోషించాడు. కానీ ఈసారి మూడో స్థానంలో అవకాశం ఇచ్చినప్పుడు తన సత్తా నిరూపించుకున్నాడు. అతను జురెల్ 700-800 పరుగులు చేసి జట్టుకు టైటిల్ అందించాలని ఆశిస్తున్నాను. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలవడం ఆనందంగా ఉంది. ఈ విజయంలో పూర్తి క్రెడిట్ బౌలర్లకే చెందుతుంది. ఈ రోజు విజయాన్ని బాగా జరుపుకుంటాం. కానీ రేపు ఉదయం నుంచి తర్వాతి మ్యాచ్‌పై దృష్టి పెట్టాలి. ముంబైపై ఎలా ఆడాలో ప్లాన్ చేస్తాం. ఈసారి గట్టిగా కొడతాం’ అని రియాన్ పరాగ్ ధీమా వ్యక్తం చేశాడు.
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
-
Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
-
Ak 47 : ‘ఆదర్శ కుటుంబం’ చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
-
Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు ‘+91’ ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
-
Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!