Hyderabad Crime: కంచన్‌బాగ్‌లో దారుణం.. మయన్మార్ మహిళపై సామూహిక లైంగిక దాడి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Crime: హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మయన్మార్‌కు చెందిన ఓ మహిళపై సామూహిక లైంగిక దాడి జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆమె భర్తతో సహా నలుగురిపై కంచన్‌బాగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. మయన్మార్‌కు చెందిన బాధితురాలిని బంగ్లాదేశ్‌కు చెందిన ఫయజ్ అనే వ్యక్తి వివాహం చేసుకున్నట్లు గుర్తించారు పోలీసులు. ఈ దంపతులు అక్రమంగా హైదరాబాద్‌కు వచ్చి కంచన్‌బాగ్ ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు.
మద్యానికి బానిసైన ఫయజ్ తన స్నేహితులతో గడపాలంటూ భార్యపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో ఆరోపించింది. ఈ క్రమంలో ఆమెపై సామూహిక లైంగిక దాడి జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి భర్తతో పాటు మొత్తం నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులంతా బంగ్లాదేశ్‌కు చెందిన వారిగా విచారణలో తేలింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, నిందితుల పాత్రపై కంచన్‌బాగ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Also Read
- Amit Shah : కాంగ్రెస్‌కు కౌంటర్‌గా బీజేపీ పాదయాత్ర.. పాల్గొననున్న అమిత్ షా
- TGGENCO : టీజీ జెన్కో బొగ్గు రవాణాకు ఒడిశా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- Retired IPS Officer Wife Murder Case: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసును ఛేదించిన పోలీసులు..
- Harish Rao : రేవంత్ సర్కార్‌కు నీళ్లు తీసుకునే తెలివి లేదు..
తాజావార్తలు
-
Hyderabad Crime: కంచన్‌బాగ్‌లో దారుణం.. మయన్మార్ మహిళపై సామూహిక లైంగిక దాడి..!
-
Arnab Cyclone Alert: ‘అర్నబ్’ తుఫాన్ ఎఫెక్ట్.. ఈ రాష్ట్రాలకు హెచ్చరికలు.. తెలంగాణాలోనూ భారీ వర్షాలు!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ, లేదంటే అంతే సంగతులు!
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..