NTV Telugu Site icon

TS Police: హైదరాబాద్ లో డ్రగ్స్ నిర్మూలనపై కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్

Drugs

Drugs

హైదరాబాద్ లో డ్రగ్స్ నిర్మూలనపై స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. ఇప్పటికే వరుస దాడులు కొనసాగుతుండటంతో పలువురుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, టీఎస్ఎన్ఏబీ, ఎస్ఓటీ, టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. 24 గంటల్లో నాలుగు డ్రగ్స్ గ్యాంగ్స్ ను అరెస్ట్ చేశారు. ఇప్పటికే హైదరాబాద్ లో భారీగా గంజాయి, డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. ఎస్ఆర్ నగర్ లోని సర్వీస్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ పార్టీని నార్కోటిక్ బ్యూరో భగ్నం చేసింది. బర్త్ డే పార్టీ కోసం గోవా నుంచి డ్రగ్స్ ను యువకులు తీసుకొచ్చారు. ఇద్దరు డ్రగ్ పెడ్లర్స్ సహా 33 మంది పోలీసుల అదుపులో ఉన్నారు.

Read Also: 300 Stones In Kidney: నీటికి బదులు బబుల్ టీ.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు!

ఇక, మరోవైపు జూబ్లీహిల్స్‌ ఫిలింనగర్‌లో డ్రగ్స్‌ ను పోలీసులు పట్టుకున్నారు. రూ. 2. 28 లక్షలు విలువ చేసే హాష్‌ ఆయిల్‌, 70 గ్రాముల చెరాస్‌ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ విక్రయిస్తున్న హైదరాబాద్‌ మహిళ సహా ఏడుగురు అరెస్ట్‌ కాగా.. పరారీలో మరో ఇద్దరు ఉన్నారు. అలాగే, నూతన సంవత్సర వేడుకలకు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్ నుంచి తీసుకుని వచ్చి హైదరాబాద్ లో అమ్మాయిలని చూస్తున్నారు.. ఓపిఎం డ్రగ్స్ 3. 4 కేజీలు, 45 గ్రాముల పాపీ స్ట్రాప్ పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు. శశిపాల్ బిష్ నాయ్, మదనలాల్ బిష్ బాయ్ అనే ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read Also: Devara: మళ్లీ నెగటివ్ ట్రెండ్… ఈసారి డైరెక్ట్ గా ఎన్టీఆర్ రంగంలోకి దిగాలేమో

అలాగే, చైతన్యపురిలో డ్రగ్స్ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో డ్రగ్ పేడ్లర్ ఉన్నాడు.. నిందితులు భీమవరంకి చెందిన కునపరాజు, లక్ష్మీ నరసింహ రాజుతో పాటు హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన జలిమ్, శ్యామ్ రాయ్ గా గుర్తించారు. ఇక, గోవాకు చెందిన డ్రగ్ పెడ్లర్ హాబీబ్ అనే వ్యక్తి కూడా పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి 5 గ్రాముల ఎమ్డీఎమ్ఏ డ్రగ్స్, ఎల్ఎస్డీ, బీఎస్ఓటీఎస్4 స్వాధీనం చేసుకోగా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ నిర్ములన కోసం పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు.

Show comments