Site icon NTV Telugu

Hyderabad Rain: హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం

Rainalert

Rainalert

Hyderabad Rain: హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, అమీర్ పేట్, గండిపేట్, తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. మోస్తరు వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. ఆఫీసులకు వెళ్లేందుకు ఉద్యోగులు, రోజువారీ పనులకు వెళ్లే ప్రజలు ట్రాఫిక్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడడంతో పలు చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. తెలంగాణ వ్యాప్తంగా 7 రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో వచ్చే నాలుగైదు రోజులు భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తోంది. తెలంగాణని పలు జిల్లాలకు కూడా వర్ష సూచన ఉన్నా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చినుకు జనాల్ని వణికిస్తోంది.

Read Also: Telangana: ఇలా కూడా ఉంటారా?.. మనవడిని అమ్మేసిన నాయనమ్మ.. దత్తత పేరుతో డ్రామా!

Exit mobile version