Minister KTR: ఐటీ ఉద్యోగాల కల్పనలో మనమే బెస్ట్.. ఫస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఐటీ ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్ బెంగళూర్ను క్రాస్ చేసిందన్నారు తెలంగాణ ఐటీమంత్రి కేటీఆర్. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో అద్భుతంగా ఐటీ అభివృద్ధి చెందుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో 20 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నారని చెప్పారు. ఐటీ రంగంలో తెలంగాణ ప్రగతి తమకు గర్వకారణమన్నారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులోని థ్రిల్ సిటీలో ఐటీ పరిశ్రమల ప్రతినిధుల ముఖాముఖి సమావేశానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐటీ రంగంలో ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్‌ను అద్భుతంగా అభివృద్ధి చేశామన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీ-హబ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఏ రాష్ట్రంలోనైనా సుస్థిర ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి జరుగుతుందన్నారు.
Also Read
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్‌లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
- Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
- BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
- Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఏం జరుగుతోంది?
పెట్టుబడులకు హైదరాబాద్ అనువైన నగరమని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఐటీ రంగంలో లక్షలాది ఉద్యోగాలు కల్పించిందని, ఉద్యోగాల కల్పనలో బెంగళూరును హైదరాబాద్ దాటిందన్నారు. అయితే, బెంగళూరును తక్కువ చేసి చూపించడం తన ఉద్దేశ్యం కాదన్నారు కేటీఆర్. ఐటీలో గత రెండేండ్లలో కొత్తగా 40 వేల ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. నగరంలో ఉత్తరంవైపు ఐటీ రంగాన్ని విస్తరిస్తున్నామన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ అద్భుతంగా పనిచేస్తున్నదని కితాబిచ్చారు. తొలిరెండు స్పేస్‌టెక్ స్టార్టప్‌లు హైదరాబాద్‌కు చెందినవేనని పేర్కొన్నారు. వ్యాపారవేత్తలు హైదరాబాద్ వైపు ఆకర్షితులవుతున్నారని చెప్పారు. తెలంగాణలో టీఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్ అందిస్తామని వెల్లడించారు.
ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉండటం ఐటీ ఇండస్ట్రీకి గర్వకారణమని హైసియా ప్రెసిడెంట్ మనీషా అన్నారు. హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి చేందుతున్నదని వెల్లడించారు. పెట్టుబడులు పెట్టడానికి హైదరాబాద్ చాలా అనుకూలమైన ప్రాంతమని ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్ అన్నారు. ఐటీ రంగంలో గత రెండేండ్లలో 40 వేల కొత్త ఉద్యోగాలు వచ్చాయన్నారు. కరోనా సమయంలో ఐటీ ఇండస్ట్రీ అందించిన సహకారం మరువలేనిదని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ సహకారం మరువలేనిదన్నారు.
Read Also: Shocking Accident : ప్రయాణికుల పాలిట ఉరి తాళ్లుగా మారుతున్న కేబుల్స్
తాజావార్తలు
-
Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
-
Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్‌లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
-
Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
-
Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!