NTV Telugu Site icon

Hyderabad: ఎల్బీనగర్‌ ఆర్టీసీ కాలనీలో ప్రేమోన్మాది ఘాతుకం.. అక్కా తమ్ముడిపై కత్తితో దాడి

Hyd

Hyd

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ ఆర్టీసీ కాలనీలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇంట్లోకి చొరబడి అక్కా తమ్ముడిపై శివకుమార్‌ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సంఘవి, పృథ్వీని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దాడి ఘటనను చూసి శివకుమార్‌ను స్థానికులు ఓ గదిలో నిర్భందించారు.

Read Also: TS News: మేకను దొంగిలించాడని తలకిందులుగా వేలాడదీసిన యజమాని.. ఇదెక్కడి అరాచకం

వివరాల్లోకి వెళ్తే.. కొంతకాలంగా సంఘవి, శివకుమార్‌ మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది. అయితే ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడేందుకు నిందితుడు శివకుమార్‌ సంఘవి ఇంటికి వచ్చాడు. పెళ్లి చేసుకోవాలని సంఘవిపై ఒత్తిడి చేశాడు. దీంతో వారి మధ్య మాటమాట పెరగడంతో వాగ్వాదం మొదలైంది. దీంతో ఇంట్లోనే ఉన్న తమ్ముడు పృథ్వీ అక్కడకు రాగానే.. తన వెంట తెచ్చుకున్న కత్తితో సంఘవి, పృథ్వీపై దాడి చేశాడు. సంఘవి మేడ, మొహం మరియు చేతులపై తీవ్రంగా గాయపరిచాడు. అడ్డుకోవడానికి వెళ్లిన తమ్ముడు పృథ్వీపై కూడా కత్తితో దాడి చేయడంతో లోపల ఘర్షణ జరిగి ఇంట్లో ఉన్న అద్దాలని పగలగొట్టారు. గాయపడిన అక్క తమ్ముడూ కిందకు పరిగెత్తడం చూసి పక్కింటి వారు కర్రలతోపైకి వచ్చి నిందితుడిని పట్టుకుని ఓ గదిలో ఉంచారు.

Read Also: Seediri Appalaraju: అమరావతిలో చంద్రబాబు మాయా ప్రపంచాన్ని సృష్టించాడు..

తీవ్ర గాయాలైన అక్కాతమ్ముడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ చింటూ మృతి చెందాడు. కామినేని ఆస్పత్రిలో సంఘవి చికిత్స పొందుతుంది. సంఘవి, పృథ్వీ ఎల్బీనగర్ లో రూమ్ లో ఉంటూ చదువుకుంటున్నారు. సంఘవి హోమియోపతి చదువుతుండగా.. పృథ్వీ బీటెక్‌ పూర్తి చేశాడు. ఈ ఘటనపై పోలీసులు సమాచారం అందుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.