Site icon NTV Telugu

Visakhapatnam: 24 గంటలలో డెలివరీ కావలసిన గర్భిణిని.. దారుణంగా చంపిన భర్త

Murder3

Murder3

విశాఖలో దారుణం చోటు చేసుకుంది. 24 గంటలలో డెలివరీ కావలసిన భార్యను గొంతు నులిమి చంపేశాడు భర్త. మనస్పర్థలు కారణంగా భార్య అనూషకు భర్త జ్ఞానేశ్వర్ మధ్య గొడవ తలెత్తింది. రెండు ఏళ్ల క్రితం వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. పీఎం పాలెం ఉడా కాలనీలో నివాసం ఉంటున్నారు. భర్త జ్ఞానేశ్వర్ స్కౌట్స్, సాగర్ నగర్ వ్యూ పాయింట్ వద్ద రెండు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నిర్వహిస్తున్నాడు. ఈరోజు ఉదయం అనూషకు ఆరోగ్యం బాగో లేదంటూ స్నేహితులకు సమాచారం ఇచ్చాడు జ్ఞానేశ్వర్.

READ MORE: UP: ముస్లిం అమ్మాయి, హిందూ అబ్బాయిపై దాడి.. నిందితులకు ‘‘యోగి’’ మార్క్ ట్రీట్మెంట్.. వీడియో వైరల్..

ఈ సమయంలో భార్యను గొంతు నులిమి చంపేశాడు. విగత జీవిగా ఉన్న అనూషను బంధువులు, స్నేహితులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అనూష మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనూష మృతదేహాన్ని కేజీహెచ్ మాచురీకి తరలించారు. భార్య అనూషను తానే హత్య చేసినట్లు పీఎం పాలెం పోలీసులు ఎదుట భర్త లొంగిపోయాడు. జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్న పీఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితున్ని కఠినంగా శిక్షించాలని, మరో అమ్మాయికి ఇటువంటి పరిస్థితి రాకూడదని అనూష తల్లి, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

READ MORE: Minister Satya Kumar: అంబేడ్కర్‌కు భారతరత్న ఇచ్చేందుకు నెహ్రూ, ఇందిరా గాంధీ నిరాకరించారు..

Exit mobile version