Site icon NTV Telugu

Andhrapradesh Crime: దెయ్యం పట్టిందనే నెపంతో భార్యను కొట్టి చంపిన భర్త

Crime

Crime

Andhrapradesh Crime: కట్టుకున్న ఇల్లాలిని కర్కశంగా హతమారుస్తున్న భర్తల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. దెయ్యం పట్టిందనే నెపంతో భార్యను భర్త కిరాతకంగా కొట్టి చంపిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోటి గ్రామంలో బళ్ళవాణి మనీషా (25)ను తన భర్త విజయ్ కుమార్ దారుణంగా కొట్టి హత్య చేశాడు.

Also Read: Hundred Meter Race: పక్కెళ్లి ఆడుకోమ్మా.. ఏంటమ్మ ఆ పరుగు.. పరువు తీశావుగా..!

మనీషా, విజయ్‌కుమార్‌లకు చాలా కాలం క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారి మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. భార్యకు విజయ్‌కుమార్‌ సరిగా తిండి కూడా పెట్టేవాడు కాదని మృతురాలి తండ్రి ఆరోపిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఫిట్స్ వచ్చాయని ఆయన చెప్పాడు.తన భార్యకు దెయ్యం పట్టిందని నెపంతో భర్త మెడపై గట్టిగా కొట్టడంతో కిందపడిపోయిందని.. చికిత్స నిమిత్తం అమలాపురం కిమ్స్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ ఆమె ప్రాణాలు విడిచింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మనీషా మృతదేహం పక్కనే తమ తల్లి చనిపోయిందని కూడా తెలియని చిన్నారులు పడుకుని ఉండడం అక్కడివారిని కలచివేసింది. వారి పరిస్థితిని చూసి పలువురు కంటతడి పెట్టారు. తన కుమార్తెను అమానుషంగా కొట్టి చంపిన భర్త, అత్తలపై చర్య తీసుకోవాలని మృతురాలు తండ్రి డిమాండ్ చేశారు.

Exit mobile version