ఈరోజుల్లో ఇన్‌స్టాగ్రామ్ వాడని వారు ఎవరున్నారు. చిన్న పిల్లలనుంచి మొదలుపెడితే పెద్దల వరకు వాడకమంటే ఏంటో చూపిస్తున్నారు. ఫోన్ లో ఉన్న రకరకాల యాప్ లను చూస్తూ.. ప్రక్కన ఉన్న మనుషులనే మరిచిపోయేంతగా మారిపోయింది ఇప్పుడున్న కాలం. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రత్యేకంగా నిలవడం కోసం ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్, రీల్స్ ఇలాంటి వాటిని వాడుతూ ఎక్కువ సమయం అందులోనే గడిపేస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో స్మార్ట్ ఫోన్ల ద్వారా ఎలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందో.
Read Also: Marri Janardhan Reddy: ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డికి హైకోర్టులో ఊరట
అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఒకరి ప్రాణం తీసింది. యూపీలోని లక్నోకు చెందిన ఓ వ్యాపారవేత్త తన భార్యను తానే హత్య చేశాడు. ఆదివారం పిల్లలతో కలిసి బయటకు వెళ్లిన వారు.. కారులోనే గొడవపడ్డారు. ఆ తర్వాత తన పిల్లల ఎదుటే భార్యను హతం చేశాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. భార్యకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్నారని.. అంతేకాకుండా ఆమె తన భర్తను ఇన్‌స్టాలో బ్లాక్ చేసిందని పేర్కొన్నారు. అందువల్ల వారి మధ్య పలుమార్లు గొడవలు జరుగుతూ ఉండేవని పోలీసులు తెలిపారు. వారికి కూతురు(12), కొడుకు(5) ఉన్నారు.
Read Also: Atharvaa:అమలా పాల్ ఒక చెత్త హీరోయిన్… యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్
ఈ హత్య ఘటనలో కీలక విషయాలు బయటికొచ్చాయి. తన భార్యకు మరెవరితో సంబంధం ఉందని అనుమానం భర్తకు వచ్చింది. ఈ నేపథ్యంలో వారు తమ కారులో రాయ్‌బరేలికి బయలుదేరారు. మధ్యలోనే పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే వైపు కారును తిప్పాడు. ఈ సమయంలో వారి మధ్య గొడవ జరగడంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త గొంతు కోశాడు. తమ ముందే తమ తల్లిని చంపారని ఆ పిల్లలు పోలీసులకు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. భర్తను అరెస్ట్ చేశారు.
