Site icon NTV Telugu

Tragedy : భార్యను కిరాతకంగా హతమార్చిన భర్త

Crime

Crime

సికింద్రాబాద్ బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది… న్యూ బోయిన్పల్లి లోని నూతన్ కాలనీలో భార్యను భర్త అతి దారుణంగా కత్తి తో నరికి చంపాడు.. గత కొద్దికాలం భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవ కారణంగా.. భార్య ఝాన్సీ లక్ష్మి పై భర్త సత్యనారాయణ పగను పెంచుకున్నాడు. ఈ సమయంలో భార్య బోయిన్పల్లి లో బంధువుల ఇంటికి వచ్చిన విషయం తెలుసుకున్న సత్యనారాయణ, బోయిన్పల్లికి వచ్చి ఆమె తో గొడవ కు దిగాడు.

Also Read : Minister RK Roja: పవన్ కళ్యాణ్‌కి ఫ్యాన్స్ ఉంటే, జగన్‌కు సైన్యముంది.. మంత్రి రోజా కౌంటర్

ఈ సమయంలో బంధువులు అడ్డగించగా వెంట తెచ్చుకున్న కత్తితో భార్యను పొడవడంతోపాటు అడ్డువచ్చిన మహిళపై దాడి చేశాడు. భార్యా ఝాన్సీ అక్కడే మృతిచెందగా గాయపడ్డా మహిళను హుటాహుటిన స్థానికులు ఆస్పత్రికి తరలించరూ…… .. సత్యనారాయణ స్వస్థలం అమలాపురం లాగా ఇతనిపై గతంలో కూడా హత్యా నేరం కింద కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.. అపార్ట్మెంట్లో వాచ్మెన్ గా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ మద్యానికి బానిసై భార్యతో కొంతకాలంగా గొడవ పడుతున్నాడు.. ఈ సమయంలో భార్య బంధువుల ఇంటికి వచ్చిన విషయం తెలుసుకొని ఆమెను హత్య చేశాడు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. ప్రస్తుతం సత్యనారాయణ పరారిలో ఉన్నాడు..

Also Read : Pawan Kalyan: ఏపీలో బలమైన మార్పు తేవాలి.. జనసేనని ఎవరు అడ్డుకుంటారో చూద్దాం

Exit mobile version