Tragedy: వీడు నిజంగా భార్యా బాధితుడే.. అందుకే 13నెలలు జైల్లో ఉన్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy:కొన్నిసార్లు చేయని తప్పుకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. భార్యను హత్య చేసిన కేసులో భర్త 13 నెలలు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన వెంటనే భర్త తన భార్య కోసం వెతుకులాట ప్రారంభించాడు. ఇంకొకరితో అదే భార్య ఇప్పుడు సజీవంగా దొరికింది. తప్పుడు సమాచారంతో కేసు పెట్టినందుకు ఇప్పుడు ఆమె తరపు బంధువులు సమస్యల్లో చిక్కుకోవాల్సి వచ్చింది.
మస్సోనా సుఖ్‌పూర్ గ్రామంలో నివసించే దీపు, రుచిని వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య కుదరలేదు. నిరంతరం గొడవలు జరిగాయి. దీంతో భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆమె తన మామతో కలిసి వెళ్లింది. కానీ పంచాయితీ మళ్లీ ఇద్దరిని కలిపింది. ఆమెకు నచ్చజెప్పి మరోసారి అత్తరింటింకి పంపింది. దీంతో తిరిగి భర్తతో వచ్చింది. అలా ఇంటికి వచ్చిన రుచి వారం రోజుల తర్వాత హఠాత్తుగా కనిపించకుండా పోయింది. దీపు, అతని కుటుంబ సభ్యులు ఆమె కోసం చాలా వెతికారు. కానీ ఎటువంటి సమాచారం లభించలేదు. దీపు, అతని కుటుంబ సభ్యులపై బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత దీపును పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
Read Also: Fire Accident : మొగుడు పెళ్లాన్ని విడదీద్దామని వచ్చారు.. మంటల్లో కాలిపోయారు
ఇప్పుడు నిజం బయటకు రావడంతో అతని భార్య రుచి సహా నలుగురిపై కేసు నమోదైంది. 13 నెలలుగా జైలులో ఉన్నాను అని బాధితుడు దీపు చెబుతున్నాడు. బెయిల్ రావడంతో భార్య కోసం వెతుకులాట ప్రారంభించాడు. అప్పుడు ఆమె భింద్ జిల్లాలోని గియాన్‌పూర్‌లో కనుగొనబడింది. దీని తర్వాత రుచి, ఆమె మేనమామ, సోదరిపై విచారణ జరుగుతోంది.
వీళ్ల కారణంగానే తమ కుటుంబం కష్టాల పాలయ్యామని దీపు తరపు వాళ్లు తెలిపారు. వారిని మూడు రోజులు పోలీస్ స్టేషన్ లోనే ఉంచారని వాపోయారు. ఇంట్లో పరిస్థితి దయనీయంగా ఉందని.. భూమిని అమ్ముకోవాల్సి రావడంతో జైలు నుంచి వచ్చిన తర్వాత దీపు చెరుకు బండి నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!