భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడితో ఎంజాయ్ చేద్దామనుకుంది భార్య. అందుకోసం అతన్ని ఇంటికి పిలిపించుకుంది. కానీ.. కుటుంబ సభ్యులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. ఈ ఘటన యూపీలోని మహారాజ్‌గంజ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తన భర్త కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు హాజరు కావడం కోసం వెళ్ళాడు. ఈ క్రమంలో.. భార్య తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. అయితే.. గదిలో నుంచి ఏదో శబ్దం రావడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో.. తలుపు తీయగానే లోపల ప్రియుడితో భార్య పట్టుబడింది. ఈ క్రమంలో.. ప్రియుడు, అతని సహచరుడిని దొరకబట్టి కుటుంబ సభ్యులు తీవ్రంగా కొట్టారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు అక్కడి చేరుకుని ప్రియుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Read Also: Aadhar Card Update: అప్పటి వరకే ఆధార్ కార్డు ఉచిత అప్డేట్.. ఆపై బాదుడే..
ఈ ఘటన శుక్రవారం అర్థరాత్రి జరిగింది. ప్రియుడు తన ప్రియురాలిని కలిసేందుకు తన వెంట ఇద్దరు స్నేహితులను తీసుకుని వచ్చాడు. అయితే.. ప్రియుడు ప్రియురాలి కోసం ఇంట్లోకి వెళ్లగా, స్నేహితులు బయట వేచి చూస్తున్నారు. కాగా.. కుటుంబ సభ్యులకు గదిలో నుంచి శబ్దాలు వినపడటంతో అనుమానం వచ్చి చూడగా అసలు బండారం బయటపడింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు గదిలో ప్రియుడిని, భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న చుట్టు పక్కల వారు ప్రియుడిని, అతని స్నేహితుడిని తీవ్రంగా చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పజెప్పారు. ఈ కేసులో యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ ఇన్‌ఛార్జ్ శ్యామ్‌దేర్వా రాహుల్ శుక్లా తెలిపారు. ఈ ఘటనపై యువకుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా.. వారు పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Read Also: Lovers Suicide: కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షకని బయల్దేరి ప్రేమజంట ఆత్మహత్య..
