Wife Nude Videos to Money Lenders: కొంత మంది చేసే పనులు చూస్తుంటే సమాజం ఎటుపోతుందా అని బాధేస్తుంది. భర్త భార్యను జీవితాంతం కాపాడాలి. కానీ అలాంటి భర్తే అప్పు తీర్చలేక భార్యను న్యూడ్ గా వీడియో కాల్ మాట్లాడాలని బలవంతం చేస్తే ఆ భార్య ఏం చేస్తుంది చెప్పండి. ఇలా భర్త వేధించడంతో చేసేది లేక పోలీసులను ఆశ్రయించి ఓ మహిళ. ఈ ఘటన కేరళలోని కాసరగూడు జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే నీలేశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 20 ఏళ్ల యువతి తన భర్తతో కలిసి నివసిస్తోంది. వారికి పెళ్లయ్యి ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాలేదు. అంతలోనే ఏ భర్త పెట్టని కష్టాలను ఆ నీచుడు పెట్టాడు. జల్సాలకు అలవాటు పడిన భర్త తమ గ్రామంలో చాలా మంది దగ్గర అప్పు చేశాడు. అప్పు తిరిగి చెల్లించిన వారు అడగడం మొదలు పెట్టారు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో వారు యువకుడి ఇంటికి వెళ్లి భార్యను బెదిరించడం మొదలు పెట్టారు. అప్పుడే ఆ యువకుడికి ఒక చెత్త ఐడియా వచ్చింది. ఆ ఆలోచనతో అప్పు తీర్చేయవచ్చని దానికి తన భార్యను బలిచేశాడు. అప్పు ఇచ్చిన వారికి నగ్నంగా ఫోన్ చేయాలని తన భార్యను బలవంతం చేశాడు. ఆమెతో వారికి న్యూడ్ వీడియో కాల్స్ చేయించాడు.
అప్పు తిరిగి ఇవ్వాలని అడగకూడదని, సూపర్ ఫిగర్ తో ఎంజాయ్ చేసే అవకాశం ఇస్తానని, ఉచితంగా తన భార్యతో బాడీ మసాజ్ చేయిస్తానని అప్పు ఇచ్చిన వారికి చెప్పాడు. దాని కోసం కావాలంటే తన భార్యతో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడిస్తానని చెప్పి ఆమెతో బలవంతంగా వారికి ఫోన్ చేయించాడు. ఈ సేవలు అన్ని మీకు కావాలంటే తనకు ఇచ్చిన అప్పు మాఫీ చేయాలని భర్త బేరం పెట్టాడు. ఇలా చాలా మందికి ఆ నీచుడు తన భార్యతో వీడియో కాల్స్ చేయించాడు. అంతేకాకుండా ఆమెను అన్ని విధాలుగా చిత్ర హింసలకు గురిచేశాడు. దీంతో ఆ భార్య తన భర్త వేధింపులు తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది. పోలీసులకు జరిగిన విషయాలన్నీ వివరించింది. దాంతో భయపడిపోయిన ఆ శాడిస్ట్ భర్త కనిపించకుండా పోయాడు. అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందని పోలీసులు తెలిపారు.