Site icon NTV Telugu

Uttar Pradesh: పెళ్లైన తొలి రోజు నుంచే అరాచకం.. అబ్బాయి కాదు అమ్మాయి

Up

Up

యూపీలోని గోరఖ్‌పూర్‌లో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తన భార్య, ఇద్దరు సోదరులతో సహా తనపై దాడి చేశారని.. ప్రాణహాని ఉందని ఓ లెక్చరర్ ఆరోపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పెళ్లయిన రోజు రాత్రి నుంచి భార్య మాటలు తనను దిగ్భ్రాంతికి గురి చేశాయని బాధితుడు ఆరోపించాడు. ఆమెను తన తల్లిగా భావించి పూజించాలని.. అంతేకాకుండా తన పాదాలను తాకమని కోరుతుందని తెలిపాడు. అలా చేయకపోతే చంపుతానని లేదంటే చస్తానని బెదిరించేదని చెప్పాడు. గోరఖ్‌పూర్‌లోని నాయి బజార్‌లో లెక్చరర్ అద్దె ఇంట్లో నివసముంటున్నాడు. 2021 నుంచి బ్రహ్మపూర్‌లోని జనతా ఇంటర్ కాలేజీలో కాంట్రాక్టర్ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న బనాత్ గ్రామానికి చెందిన దీపను వివాహం చేసుకున్నాడు.

Read Also: Off The Record: తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందా? చేయదా?

అయితే తన భార్య ప్రవర్తన గురించి తన పుట్టింటి వారికి చెప్పగా.. వారు తమ బిడ్డ మానసిక స్థితికి గురైందని చెప్పారు. అనంతరం అత్తగారింటికి వెళ్లిన భార్య.. మళ్లీ అలానే పిచ్చిగా ప్రవర్తించడం ప్రారంభించింది. ఆమే మానసిక స్థితిని దృష్టిలో ఉంచుకుని.. చికిత్స చేయించాలని ఆమే తల్లి దండ్రులకు చెప్పారు. అనంతరం తాను అద్దెకు ఉంటున్న ఇంట్లోకి అతని భార్య, తన సోదరులు వచ్చి తనను హత్య చేస్తానని బెదిరించినట్లు బాధితుడు తెలిపాడు. దీంతో తీవ్ర భయాందోళకు దిగిన బాధితుడు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసుపై గోరఖ్‌పూర్ ఎస్పీ నార్త్ మనోజ్ కుమార్ అవస్తీ మాట్లాడుతూ.. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Exit mobile version