Site icon NTV Telugu

Extramarital Affair: ప్రియుడితోనే ఉంటా, నువ్ చచ్చిపో అన్న భార్య.. ఆత్మహత్య చేసుకున్న భర్త!

Crime News

Crime News

వివాహేత‌ర సంబంధం కారణంగా ప్రతి రోజు దేశంలో ఎందరో ఆత్మహత్య చేసుకుంటున్నారు. వివాహేత‌ర సంబంధాలతో మనస్తాపం చెంది భార్య లేదా భర్త చనిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే తెలంగాణలోని రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ‘ప్రియుడితోనే ఉంటా, నువ్ చచ్చిపో’ అని భార్య అనడంతో మనస్తాపం చెందిన భర్త.. వ్య‌వ‌సాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో బోయిన‌పల్లి మండ‌లం త‌డ‌గొండ‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

వివరాల ప్రకారం… తడగొండకు చెందిన హరీశ్ (36)కు కరీంనగర్ జిల్లా బద్దిపెల్లి గ్రామానికి చెందిన కావేరితో 2014లో వివాహం అయింది. వీరికి ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. హరీశ్ ఉపాధి కోసం దుబాయి వెళ్ళాడు. అతడి భార్య కావేరి వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయంలో ఇటీవల ఫోన్లో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భార్యకు నచ్చజెప్పేందుకు ఈ నెల 8న హరీశ్ దుబాయి నుంచి తడగొండకు వచ్చాడు. దేశాల నుంచి వచ్చిన భర్తతో మంచిగా మాట్లాడాల్సిది పోయి.. ‘నువ్వు నాకు వద్దు చచ్చిపో.. నేను రక్షణ్‌తోనే ఉంటా’ అని భర్తతో కావేరి అంది.

Also Read: Adluri Laxman Kumar: పనిలో నిజాయితీగా ఉండాలి.. పార్టీ కోసం పనిచేయాలి!

భర్య కావేరి మాటలతో హరీశ్ తీవ్ర మనస్తాపం చెందాడు. బయటకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్ళాడు. సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హరీశ్ ఇంతకీ ఇంటికీ రాకపోవడంతో.. చుట్టుపక్కల వెతికారు. వ్యవసాయ బావిలో అతడు శవమై కనిపించాడు. కొడుకు శవాన్ని చూసి హరీశ్ తల్లి కన్నీరుమున్నీరు అయింది. హరీశ్ తల్లి ఫిర్యాదు మేరకు కావేరి, రక్షణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Exit mobile version