NTV Telugu Site icon

Maharastra: భార్య పిల్లలను కనడం లేదని కిరాతకంగా చంపిన భర్త

Murder

Murder

Maharastra: ఇటీవల కాలంలో దంపతుల మధ్య చిన్న చిన్న విషయాలకే దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక్క క్షణం ఆలోచించకుండా జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. తప్పు ఎవరిది అనేది పక్కపెట్టి ఈగోలకు పోతున్నారు. అలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. థానే జిల్లాలో భార్య గర్భం దాల్చడం లేదని భార్య ఆమెను అతి కిరాతకం చంపేశాడు. పిల్లలు కనే విషయంలోనే ఇద్దరూ తరచూ గొడవలు పడే వారని సమాచారం. ఈ విషయంలో వారి మధ్య గొడవ పెద్దదై ఓ వ్యక్తి తన 35 ఏళ్ల భార్యను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read Also:Delhi Incident: ఢిల్లీలో దారుణం.. 16 ఏళ్ల బాలికను 21 సార్లు కత్తితో పొడిచి హత్య..

వివరాల్లోకి వెళితే.. అంబర్‌నాథ్ ప్రాంతంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కాలనీలో వీరిద్దరు నివాసం ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరగడంతో 37 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఉల్హాస్‌నగర్ కంట్రోల్ రూమ్ అధికారి తెలిపారు. ఆ వ్యక్తి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జాబ్ చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. మహిళ గర్భం దాల్చకపోవడంతో భార్యాభర్తలు తరచూ గొడవ పడుతుండేవారని అధికారి తెలిపారు. ఆదివారం మళ్లీ వారిద్దరి మధ్య గొడవ జరగడంతో నిందితుడు భార్యపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు.

Read Also:Viral: బీభత్సం సృష్టిస్తున్న ఈదరగాలులు.. కుప్పకూలిన సెల్ టవర్

దాడి తర్వాత మహిళ కుప్పకూలి స్పాట్లోనే చనిపోయినట్లు తెలిపారు. విషయం తెలియడంతో ఫ్యాక్టరీలోని వర్కర్స్ యూనియన్ ప్రతినిధి పోలీసులను అప్రమత్తం చేశారు. సమాచారం అందుకుని వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం చేసేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి పంపినట్లు పోలీసు ఇన్‌స్పెక్టర్ జెబి సోనావానే మీడియాకు తెలిపారు. ఆ వ్యక్తిని ఆదివారం రాత్రి అరెస్టు చేసి అతనిపై హత్య నేరం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Show comments