Site icon NTV Telugu

BJP Leader Sana Khan: బీజేపీ నాయకురాలు సనాఖాన్‌ హత్య కేసులో ఆమె భర్త అరెస్ట్

Sana Khan

Sana Khan

BJP Leader Sana Khan: నాగ్‌పూర్ బీజేపీ నాయకురాలు సనా ఖాన్ అదృశ్యమైన పది రోజుల తర్వాత.. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఆమెను హత్య చేసినందుకు ఆమె భర్త అమిత్ సాహును శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అమిత్ సాహు నేరాలను అంగీకరించాడు. నాగ్‌పూర్ పోలీసుల బృందం జబల్‌పూర్‌లోని ఘోరా బజార్ ప్రాంతం నుంచి మరొక వ్యక్తిని అరెస్టు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమిత్ సాహు సనా ఖాన్ మృతదేహాన్ని నదిలో పడేశాడు. అయితే బాధితురాలి మృతదేహం ఇంకా లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు.

Read Also: Heart Attack: ఫ్రెషర్స్ డే వేడుకలో విషాదం.. డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో ఇంటర్‌ విద్యార్థిని మృతి

నాగ్‌పూర్ నివాసి, బీజేపీ మైనారిటీ సెల్ సభ్యురాలు సనా ఖాన్ జబల్‌పూర్‌ను సందర్శించిన తర్వాత అదృశ్యమయ్యారు. ఆమె కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం, ఆగస్టు 1న సనాఖాన్ చివరి లొకేషన్ జబల్‌పూర్‌లో ఉంది. అక్కడ ఆమె అమిత్ సాహుని కలవడానికి వెళ్ళింది. సనాఖాన్ నాగ్‌పూర్ నుంచి ప్రైవేట్ బస్సులో బయలుదేరి, మరుసటి రోజు నగరానికి చేరుకున్న తర్వాత తన తల్లికి ఫోన్ చేసింది. అయితే కొద్దిసేపటికే ఆమె కనిపించకుండా పోయింది. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన నాగ్‌పూర్ పోలీసుల బృందంఈరోజు స్థానిక కోర్టులో హాజరుపరచనుంది.

Exit mobile version