జీడిమెట్లలో కల్తీ కల్లు కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా, భోపాల్ కు చెందిన భార్యాభర్తలు రామ్ రెడ్డి నగర్ లోని కల్లు దుకాణంలో కల్లు సేవించి అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల క్రితం గాజుల రామారం లో నివసిస్తున్న తమ కూతురు రేఖ దగ్గరికి వచ్చారు లచ్చిరాం,సాక్రిభాయ్ అనే దంపతులు. ఊర్లో ప్రతిరోజు కల్లు తాగే అలవాటు ఉండటంతో,రామ్ రెడ్డి నగర్ లోని కల్లు దుకాణంలో నిన్న సాయంత్రం కల్లు సేవించారు లచ్చిరాం దంపతులు. కల్లు తాగినప్పటి నుంచి కాళ్ళు చేతులు లాగడం, పిచ్చిగా ప్రవర్తించడంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Also Read:Road Accident: రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. అండగా ఉంటామని హామీ!
హైదర్‌నగర్, కూకట్‌పల్లి, నడిగడ్డతండా, కేపీహెచ్‌బీ తదితర ప్రాంతాలకు చెందిన కొంతమంది కల్లు తాగారు. ఆ రోజు బాగున్నా.. సోమవారం ఉదయం నుంచి క్రమంగా బీపీ పడిపోవడం, కొందరు స్పృహ కోల్పోవడం, తీవ్ర విరేచనాలు, వాంతులు, అచేతనంగా మారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వీరిని హైదర్‌గూడ రాందేవ్‌రావ్ ఆసుపత్రిలో చేర్చారు. గాంధీలో చికిత్స పొందుతున్న పుట్టి గంగమణి మృతి చెందారు. కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది.