Iran: ఇరాన్‌లో మరో ఘాతుకం.. విద్యకు దూరం చేసేందుకు విద్యార్థినులపై విషప్రయోగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: కొన్ని నెలల క్రితం ఇరాన్ జరిగిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. బాలికలను చదువుకు దూరం చేసేందుకు చేసిన ప్రయత్నాల గురించి ఇరాన్ మంత్రి ఒకరు వెల్లడించారు. హిజాబ్ వ్యతిరేక ఆందోళనలను మరువకముందే ఇరాన్‌ను మరో విషయం కుదిపేస్తోంది. బాలికలను విద్యకు దూరం చేసేందుకు వారి ప్రాణాలను బలితీసుకునే కుట్రలు జరిగాయని, వారిపై విషప్రయోగం చేసినట్లు ఇరాన్ మంత్రి ఒకరు పేర్కొన్నారు. ఇరాన్‌లో వందలాది మంది విద్యార్థినులపై విషప్రయోగం జరిగింది. ఆ దేశంలో మహిళలపై జరుగుతున్న హింసాకాండను మరువక ముందే మరో ఘాతుకం వెలుగులోకి వచ్చింది. బాలికల విద్యను ఆపేయాలన్న ఉద్దేశంతో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన టెహ్రాన్‌లో కోమ్‌లోని ఒక పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ మేరకు డిప్యూటీ ఆరోగ్య శాఖ మంత్రి యూనెస్ పనాహి ఈ ఘటన ఉద్దేశపూర్వకంగానే జరిగినట్లు తెలిపారు.
గతేడాది నవంబర్ నుంచి కోమ్, దక్షిణ టెహ్రాన్‌లో వందలాది విద్యార్థినులకు శ్వాసకోశం విషపూరితమైనట్లు వైద్యులు గుర్తించారు. దీనిపై తాజాగా ఇరాన్ మంత్రి యునెస్ పనాహి స్పందించారు. ఈ విష ప్రయోగం కావాలనే జరిగినట్లు మంత్రి వెల్లడించారు. ఇదంతా బాలికల పాఠశాలలను మూసివేసి.. వారిని విద్యకు దూరం చేసేందుకేనని ఆయన వెల్లడించారు. ఈ దారుణం వెనుక ఎవరున్నారు అనే విషయాలను మాత్రం పేర్కొనలేదు. అలాగే ఇంతవరకు ఎలాంటి అరెస్టు చోటుచేసుకోకపోవడం గమనార్హం. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఈ విషయమై అధికారులను నిలదీసేందుకు నగర గవర్నరేట్ కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. అంతేగాదు విద్యార్థినులపై విష ప్రయోగం జరిగిన వెంటనే కొంతమంది అన్ని పాఠశాలలను ముఖ్యంగా బాలికల పాఠశాలలను మూసివేయాలని కోరినట్లు ఇరాన్ స్థానిక మీడియాలు కూడా పేర్కొన్నాయి.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
Read Also: Halari Donkey: గర్భం దాల్చిన గాడిదలకు సీమంతం.. గొప్ప కారణమే ఉందండోయ్ !
ఈ విషప్రయోగ ఘటనపై ఫిబ్రవరి 14న బాధితుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టడంతో.. దీనికి గల కారణాలను గుర్తిస్తున్నామని అక్కడి సర్కారు స్పందించింది. ప్రభుత్వ ప్రతినిధి అలీ బహదోరి జహ్రోమి మాత్రం ఇంటెలిజెన్స్, విద్యా మంత్రిత్వ శాఖలు ఈ ఘటనకు గల కారణాలను కనుగొనడానికి యత్నిస్తున్నట్లు ప్రకటించారు. అంతేగాదు ఈ ఘటనకు కారణాలపై సత్వరమే దర్యాప్తు చేయాల్సిందిగా అధికారులును అదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!