NTV Telugu Site icon

Hundred on Test Debut: చివరి నలుగురు అరంగేట్ర ప్లేయర్స్ సెంచరీలు బాదారు.. అందరూ ముంబై ఆటగాళ్లే!

Hundred On Test Debut

Hundred On Test Debut

Mumbai Players Rohit, Shaw, Iyer and Jaiswal Scored Hundred in Test Debut: అంతర్జాతీయ క్రికెట్‌కు ‘టెస్ట్ క్రికెట్’ వెన్నెముకగా పేరుగాంచింది. ఈ ఏడాదితో టెస్టు క్రికెట్‌కు 144 ఏళ్లు పూర్తయ్యాయి. మార్చి 1877లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఓ ఆటగాడిలోని ప్రతిభ టెస్ట్ క్రికెట్‌లో మాత్రమే బయటపడుతుంది. అందుకే ప్రతి ప్లేయర్ సాంప్రదాయ క్రికెట్ ఆడాలని కోరుకుంటారు. అంతేకాదు అరంగేట్రం టెస్టు మ్యాచ్‌లో సెంచరీ చేయాలని కూడా చాలా మంది కల కంటారు. కానీ ఇది అంతసులువుగా సాధ్యం కాదు. ఇప్పటివరకు 112 మంది ఆటగాళ్లు మాత్రమే తమ అరంగేట్ర టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీలు సాధించారు.

క్రికెట్‌ చరిత్రలో అరంగేట్రం మ్యాచ్‌లో మొదటి సెంచరీ 1877లో నమోదైంది. 15 మార్చి 1877న ఆస్ట్రేలియా ఆటగాడు చార్లెస్ బ్యానర్‌మాన్ ఈ ఘతన సాధించాడు. ఇక లాలా అమర్‌నాథ్ తన అరంగేట్రం టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన మొదటి భారతీయ బ్యాటర్‌గా నిలిచాడు. తన తొలి మూడు టెస్టు మ్యాచ్‌ల్లో సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు మహ్మద్ అజారుద్దీన్ మాత్రమే. ఇక ఇప్పటివరకు 17 మంది భారత ఆటగాళ్లు తమ అరంగేట్రం టెస్టు మ్యాచ్‌లో సెంచరీలు సాధించారు.

Also Read: Dharmana Prasada Rao: ఇప్పటి వరకు అసైన్డ్ భూమి ఎవరికైనా అమ్మితే చెల్లదు..

అరంగేట్రం మ్యాచ్‌లో సెంచరీ చేసిన భారత ఆటగాళ్లు 17 మంది ఉన్నా.. ఓ నలుగురు ప్రత్యేకంగా నిలిచారు. వారే రోహిత్ శర్మ (177), పృథ్వీ షా (134), శ్రేయాస్ అయ్యర్ (105), యశస్వి జైస్వాల్ (143 నాటౌట్). వీరందరూ తమ అరంగేట్ర మ్యాచులో సెంచరీలు బాదారు. వీరు భారత్ తరపున అరంగేట్రం చివరి నలుగురు ప్లేయర్స్ కూడా. ఈ నలుగురు ప్లేయర్స్ ముంబై వాళ్లే కావడం ఇక్కడ విశేషం. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ శతకం బాదిన విషయం తెలిసిందే.

List of Centuries Scored by Indians in Test Debut:
1. Lala Amarnath-118-England (1933)
2. Deepak Shodhan-110-Pakistan (1952)
3. AG Kripal Singh-100*-New Zealand (1955)
4. Abbas Ali Baig-112-England (1959)
5. Hanumant Singh-105-England (1964)
6. Gundappa Viswanath-137-Australia (1969)
7. Surinder Amarnath-124-New Zealand (1976)
8. Mohammad Azharuddin-110-England (1984)
9. Pravin Amre-103-South Africa (1992)
10. Sourav Ganguly-131-England (1996)
11. Virender Sehwag-105-South Africa (2001)
12. Suresh Raina-120-Sri Lanka (2010)
13. Shikhar Dhawan-187-Australia (2013)
14. Rohit Sharma-177-West Indies (2013)
15. Prithvi Shaw-134-West Indies (2018)
16. Shreyas Iyer-105-New Zealand (2021)
17. Yashasvi Jaiswal-110-West Indies (2023)

Also Read: Tomatoes For Flight Bookings: ఫ్లైట్‌ టికెట్‌ బుక్‌ చేసుకుంటే.. టమాటాలు ఫ్రీ!