NASA: 2030కి ముందు మానవులు చంద్రునిపై జీవించి పని చేసే అవకాశం ఉందని నాసా అధికారి ఒకరు తెలిపారు.ఆర్టెమిస్ రాకెట్ విజయవంతంగా ప్రయోగించబడిన తర్వాత ఈ దశాబ్ధం ముగిసేలోపు మానవులు చంద్రునిపై నివసించవచ్చని నాసా అధికారి వెల్లడించారు. 2030 కి ముందే మనుషులు చంద్రునిపై చురుగ్గా పని చేసుకోవచ్చని.. మానవులకు రోవర్లు మద్దతుగా ఉంటాయని ఓరియన్ లూనార్ స్పేస్‌క్రాఫ్ట్ ప్రోగ్రామ్ హెడ్ హోవార్డ్ హు పేర్కొన్నారు.
సాంకేతిక సమస్యలు, హరికేన్‌ల కారణంగా ఆర్టెమిస్ ప్రయోగం ఆలస్యం అయిందని ఆయన అన్నారు. ఈ మిషన్ విజయవంతమైతే తదుపరి ఆర్టెమిస్ 2, ఆర్టెమిస్ 3 ప్రయోగాలకు మార్గం సుగమం అవుతుందని.. ఈ రెండూ చంద్రుని మీద మనుషులు జీవించడానికి ఎంతగానో ఉపయోగపడనున్నాయని హోవార్డ్ హు తెలిపారు. భవిష్యత్తులో వ్యోమగాములు జీవించడానికి చంద్రునిపై అంతరిక్ష కేంద్రం అయిన లూనార్ గేట్‌వే నిర్మాణం, అభివృద్ధికి కూడా ఆర్టెమిస్ ప్రోగ్రామ్ బాధ్యత వహిస్తుంది. ఓరియన్ క్యాప్సూల్ డిసెంబర్ 11న భూమిపైకి రానుంది. ఈ ప్రయోగం అమెరికాకు మాత్రమే కాకుండా యావత్ ప్రపంచం దీర్ఘకాలిక అంతరిక్ష అన్వేషణకు మొదటి అడుగు అని ఆయన అభివర్ణించారు. ఆర్టెమిస్ ప్రయోగించిన రోజు చారిత్రాత్మకమైన రోజంటూ ఆయన తెలిపారు.
Madras Eye Effect: తమిళనాడుని వణికిస్తున్న మద్రాస్ ఐ.. లక్షణాలేంటో తెలుసా?
తొలిసారిగా 1969లో అమెరికాకు చెందిన వ్యోమగామి నీల్‌ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై కాలు మోపారు. 1969 నుంచి 1972 వరకు అపోలో మిషన్ ద్వారా 24 మంది వ్యోమగాములను నాసా చంద్రుడి వద్దకు పంపింది. వీరిలో 12 మంది చంద్రునిపై కాలుమోపారు. ఆ తర్వాత ఎవ్వరు కూడా జాబిల్లిపై అడుగుపెట్టలేదు. చంద్రుడి మీదకు చివరిసారిగా మనుషులు వెళ్లి వచ్చిన నాసా అపోలో 17 మిషన్‌కు ఈ ఏడాది డిసెంబర్‌లో 50 ఏళ్లు పూర్తవుతాయి. 50 ఏళ్ల విరామం తర్వాత ఇప్పుడు చంద్రుడి మీదకు మళ్లీ మనుషులను పంపించటానికి నాసా శ్రీకారం చుడుతోంది. ఈసారి మూన్ మిషన్‌కు ‘ఆర్టిమిస్ ప్రోగ్రామ్’ అని నాసా పేరు పెట్టింది. ఈ ఆర్టిమిస్ ప్రయోగాలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపడతామని నాసా కొన్నేళ్ల కిందటే ప్రకటించింది.