గుంటూరు మిర్చి యార్డ్ లో ఇసుక వేస్తే రాలనీ పరిస్థితి తలెత్తింది ..గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, కర్ణాటక, తెలంగాణ, లాంటి ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో వస్తున్న మిర్చి టిక్కీల వాహనాలతో మార్కెట్ యార్డ్ నిండిపోయింది ….దీంతో ఎగుమతి దారులు సరుకును తరలించలేక పోవడం, మరో వైపు వస్తున్న సరుకును ఆపలేని పరిస్థితిలో పాలకవర్గం ఉండటంతో, మిర్చి రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు… దీనికి తోడు పెద్ద ఎత్తున వస్తున్న మిర్చి దెబ్బకు వ్యాపారులు రేట్లు సగానికి సగం కోసి అడుగుతున్నారని, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Karnataka: కర్ణాటకలో దేవాలయాలు పన్ను చెల్లించాల్సిందే.. ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ ఆగ్రహం
గుంటూరు మిర్చి యాడ్ లో లక్షల సంఖ్యలో వస్తున్న మిర్చి టిక్కీలను సాధ్యమైనంత మేర క్లియర్ చేస్తామని అంటున్నారు పాలకవర్గ చైర్మన్ ….గత సీజన్లో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ఫిబ్రవరి కి కూడా పెద్ద ఎత్తున సరుకు వస్తుందని, ఇతర రాష్ట్రాల్లో రేట్లు తగ్గుముఖం పట్టడంతో , ఆ ప్రాంతాల నుంచి కూడా గుంటూరు యార్డు కు సరుకు వస్తుందని దీంతోనే ఈ సమస్య తలెత్తిందని అంటున్నారు… మరోవైపు ఇప్పటికే గుంటూరు కోల్డ్ స్టోరేజ్ లో 30 లక్షల టిక్కీల సరుకు ఉందని, మిర్చి మొత్తాన్ని బయటకు పంపించేందుకు గత బుధవారం మిర్చి యార్డుకు సెలవు కూడా ప్రకటించామని, మరో సారి ఎగుమతి, డిమాండ్ తగ్గడంతో ఇటు వ్యాపారులు అటు రైతులు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనని అంటున్నారు, రైతుల ఇబ్బందులు తొలగించడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని అంటున్నారు మిర్చి యార్డు చైర్మన్ రాజా నారాయణ.
Virat Kohli-Akay: విరాట్ కోహ్లీ, అకాయ్ ఫోటోలు చూశారా?.. నాన్న మ్యాచ్ ఆడుతుంటే..!