Site icon NTV Telugu

Nellore: రూ.500 కడితే 7లక్షలు.. నెల్లూరులో మనీ స్కీం పేరుతో భారీ మోసం

Nellore

Nellore

Nellore: మనీ స్కీం పేరుతో నెల్లూరులో మోసం చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. కలువాయికి చెందిన వరాల కొండయ్య తన కుమారుడు సునాతం పేరుతో నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డులో ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. ట్రస్టు ద్వారా వివిధ ఏజెంట్ నియమించుకొని ప్రజల నుంచి రూ.500 నుంచి 6 వేల రూపాయల వరకూ వసూలు చేశారు. 500కడితే నెలకు ఏడు లక్షలు..ఆరు వేలు కడితే 18 లక్షలు ఇస్తామని ఆశపెట్టారు. డబ్బులు కట్టించిన వాళ్లకి ఖరీదైన బహుమతులు ఇస్తామని కూడా చెప్పారు. దీంతో పలువురు.. ప్రజల నుంచి డబ్బులు కట్టించారు. ప్రస్తుతం డబ్బులు అడుగుతుండడంతో సమాధానం చెప్పడం లేదని బాధితులు అంటున్నారు. చెన్నై… ప్రధాన కార్యాలయాన్ని నెల్లూరులో మరొక బ్రాంచిని ఏర్పాటుచేసి వసూలు చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం బాధితులు కొండయ్యను ప్రశ్నించగా వచ్చే నెలలో అసలు ఇస్తానని చెప్పినట్లు తెలిసింది. అధికారులు విచారించి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Read Also: ATM Theft: 48 గంటల వ్యవధిలో మూడు ఏటీఏంలను కొల్లగొట్టేశారు..

 

Exit mobile version