Site icon NTV Telugu

Samsung Galaxy Z Fold 6: డీల్ అదిరింది.. సామ్ సంగ్ గెలాక్సీ Z Fold 6 పై రూ.58,000 డిస్కౌంట్..

Samsung Galaxy Z Fold 6

Samsung Galaxy Z Fold 6

ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లకు డిమాండ్ పెరిగింది. బ్రాండెడ్ ఎలక్ట్రానిక్ కంపెనీలు క్రేజీ ఫీచర్లతో ఫోల్డబుల్ ఫోన్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. మరి మీరు కూడా కొత్త ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ కొనాలని భావిస్తున్నారా? అలా అయితే, ఫ్లిప్‌కార్ట్ ఎండ్-ఆఫ్-సీజన్ సేల్ కొన్ని బెస్ట్ డీల్‌లను అందిస్తుంది. Samsung Galaxy Z Fold 6 ఎటువంటి బ్యాంక్ ఆఫర్‌లు లేకుండా ఫ్లిప్‌కార్ట్‌లో రూ.58,009 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. కంపెనీ ఈ హ్యాండ్ సెట్ ను రూ. 1,64,999 ప్రారంభ ధరకు పరిచయం చేసింది.

Also Read:CM Revanth Reddy: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత ఫలితాలు సాధించింది.. 2029 లో కూడా ఈ తీర్పు రిపీట్

ఇది డ్యూయల్ AMOLED డిస్‌ప్లే, ట్రిపుల్-కెమెరా సెటప్, ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంది. ఈ సేల్ డిసెంబర్ 21 వరకు ఉంటుంది. ఈ ఆకట్టుకునే సామ్ సంగ్ ఫోన్ భారత్ లో రూ. 164,999 ధరకు లభిస్తుంది, కానీ ప్రస్తుతం, మీరు ఈ బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ.106,990కి కొనుగోలు చేయొచ్చు. రూ.58,009 వరకు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్/ఎస్‌బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో 5% వరకు క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది.

Also Read:చలికాలంలో హాట్ వాటర్ హెడ్ బాత్: మంచిదా? చెడ్డదా? పూర్తి వివరాలు ఇవే!

Samsung Galaxy Z Fold 6 స్పెసిఫికేషన్లు

స్పెసిఫికేషన్ల పరంగా, ఈ Samsung ఫోన్ పవర్ ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 7.6-అంగుళాల ఇంటర్నల్ డిస్‌ప్లే, 6.3-అంగుళాల ఎక్స్ టర్నల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. రెండు డిస్‌ప్లేలు డైనమిక్ AMOLED 2X ప్యానెల్‌లు, ఇవి 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తాయి. Z Fold 6 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా కూడా ఉంది. 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, 10MP టెలిఫోటో లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీల కోసం, ఫోన్‌లో 10MP ఫ్రంట్ కెమెరా ఉంది. 25W ఛార్జింగ్ సపోర్ట్‌తో 4400mAh బ్యాటరీని కలిగి ఉంది.

Exit mobile version