NTV Telugu Site icon

Big Saving Days Sale 2024: బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌.. మోటో ఎడ్జ్‌ 40 నియోపై భారీ తగ్గింపు!

Motorola Edge 40 Neo

Motorola Edge 40 Neo

Offers on Motorola Edge 40 Neo in Flipkart Big Saving Days Sale 2024: ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్‌ సేవింగ్ డేస్‌’ సేల్‌ మే 3 నుంచి మే 9 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లపై భారీగా డిస్కౌంట్లు అందించనున్న ఫ్లిప్‌కార్ట్‌ పేర్కొంది. శాంసంగ్‌ ఎస్‌23, పోకో ఎక్స్‌6 ప్రో, నథింగ్‌, మోటో, ఐఫోన్‌ 14 వంటి స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు ఉంది. ఈ సేల్‌లో మోటో ఎడ్జ్‌ 40 నియో ఫోన్‌ రూ.19,999కే అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ధర 22,999గా ఉంది.

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ 2024లో మోటో ఎడ్జ్‌ 50 ప్రో రూ.27,999కే లభించనుంది. ఈ ఫోన్ ధర ప్రస్తుతం రూ.30,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఎడ్జ్‌ 50 ప్రోపై ఇప్పుడు 16 శాతం తగ్గింపు ఉండగా.. అది ఇంకా పెరగనుంది. మోటో జీ64 రూ.12,999, మోటో జీ34 రూ.9,999కే కొనుగోలు చేయొచ్చు. మరోవైపు పోకో ఎం6 రూ.7,999, పోకో ఎక్స్‌6 రూ.17,999కే లభిస్తుంది. పోకో ఎక్స్‌6 ప్రో, పోకో ఎం6 ప్రో ఫోన్లపై కూడా డిస్కౌంట్లు ఉండనున్నాయి. ఈ ఆఫర్లు ఇంకా రివీల్‌ చేయలేదు.

Also Read: T20 World Cup 2024: ప్యాట్ కమిన్స్‌కు షాక్.. ప్రపంచకప్‌లో ఆడే ఆస్ట్రేలియా జట్టు ఇదే!

బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌లో గూగుల్‌ పిక్సెల్‌ 7ఏ ధర రూ.31,999, పిక్సెల్‌ 8 రూ.49,999కే లభించనుంది. ఆఫర్‌ సమయంలో ఐఫోన్‌ 14 రూ.55,999, ఐఫోన్‌ 12ను రూ.39,499కే సొంతం చేసుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23పై భారీ తగ్గింపును ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. గెలాక్సీ ఎస్‌23 బేసిక్‌ వేరియంట్‌ ధర రూ.74,999గా.. 256జీబీ వేరియంట్‌ను రూ.79,999గా లాంచ్‌ చేసింది. ఆ తర్వాత రూ.10వేలు తగ్గించింది. బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌లో గెలాక్సీ ఎస్‌23 రూ.44,999కే లభించనుంది. ఏకంగా రూ.20వేలు డిస్కౌంట్‌ పొందవచ్చు. గెలాక్సీ ఎస్‌23 ఎఫ్‌ఈ రూ.39,999కే లభ్యమవుతుంది.

 

Show comments