NTV Telugu Site icon

Massive Fire in Shopping Mall: షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న అగ్నికీలలు

Megha Kimki

Megha Kimki

Massive Fire in Shopping Mall: రష్యాలోని ఓ పెద్ద షాపింగ్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో సుమారు ఏడు వేల చదరపు మీటర్ల విస్తీర్ణం మేర మంటలు విస్తరించాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రష్యా క్యాపిటల్ మాస్కో ఉత్తర శివారు ప్రాంతమైన ఖిమ్కిలో ఈ సంఘటన జరిగింది. అక్కడి మెగా ఖిమ్కి షాపింగ్ సెంటర్‌లో శుక్రవారం తెల్లవారుజామున భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఫుట్‌బాల్‌ క్రీడా మైదానం మేర విస్తీర్ణంలో ఉన్న షాపింగ్‌ మాల్‌ అంతటా మంటలు వ్యాపించాయి. కొన్ని పేలుడు శబ్ధాలు కూడా వినిపించినట్లు స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ షాపింగ్‌ మాల్‌ భవనంలో ఉంటున్న నివాసితులు, సిబ్బంది అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు.

కాగా, సమాచారం అందుకున్న వెంటనే ఫైర్‌ సిబ్బంది, అగ్నిని నియంత్రణ వాహనాలతో ఫైటర్లు అక్కడకు చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే మంటలు పెట్టి ఉంటారని రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ అనుమానం వ్యక్తం చేసింది. మాస్కోలోని షెరెమెటీవో విమానాశ్రయం నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖిమ్కి, మెగా షాపింగ్ మాల్‌తోపాటు ప్రసిద్ధ ఎంటర్ టైన్ మెంట్ కేంద్రం కూడా. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి ముందు పశ్చిమ దేశాల రిటైల్‌ వ్యాపార కంపెనీలకు ఈ షాపింగ్‌ సెంటర్‌ నిలయంగా ఉండేది. మరోవైపు ఈ భారీ అగ్నిప్రమాదం వీడియో క్లిప్‌లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.