NTV Telugu Site icon

Manipur :మణిపూర్‌లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం..

New Project (19)

New Project (19)

మణిపూర్‌లోని తౌబాల్ జిల్లాలో అస్సాం రైఫిల్స్, మణిపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అసోం రైఫిల్స్‌ ఆదివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అధికారిక ప్రకటన ప్రకారం.. ఆపరేషన్ లో భద్రతాదళాలు ఒక 12 బోర్ సింగిల్ బ్యారెల్ గన్, ఒక 12 బోర్ బోల్ట్ యాక్షన్ రైఫిల్, ఒక 9 mm CMG, మందుగుండు సామగ్రి, గ్రెనేడ్‌లు స్వాధీనం చేసుకున్నాయి.

READ MORE: HDFC: హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు అలర్ట్..యూపీఐ లావాదేవీలకు సంబంధించిన ఎస్ఎమ్ఎస్ లు బంద్..!

అల్లర్లు, హింసతో రగులుతున్న మణిపూర్‌ లో భద్రతా దళాలు మరో పురోగతి సాధించాయి. భారీగా ఆయుధాలు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. మణిపూర్‌లోని తౌబల్ జిల్లాలోని వైథౌ రిడ్జ్ ప్రాంతంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉనికికి సంబంధించి నిర్దిష్ట ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో ఆపరేషన్ ప్రారంభించారు. అస్సాం రైఫిల్స్, మణిపూర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ కొనసాగింది. స్వాధీనం చేసుకున్న వస్తువులను మణిపూర్ పోలీసులకు అప్పగించినట్లు ప్రకటనలో తెలిపారు. అంతకుముందు, మణిపూర్ పోలీసులు శుక్రవారం తెంగ్నౌపాల్ జిల్లాలోని లామ్‌లాంగ్ గ్రామ సమీపంలోని శాంటాంగ్ నుంచి ముగ్గురు తిరుగుబాటుదారులను భద్రతా దళాలు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో కేవైకేఎల్ (KYKL) గ్రూప్‌కు చెందిన థియామ్ లుఖోయ్ లువాంగ్ (21), కాషమ్ ప్రేమ్‌చంద్ సింగ్ (24), కేసీపీ (KCP) నోయాన్ గ్రూప్‌కు చెందిన ఇనావోబీ ఖుండ్రక్‌పామ్ (20) ఉన్నారు.