NTV Telugu Site icon

Harassment : గదికి రమ్మన్నాడు.. బట్టలు విప్పమన్నాడు.. కీచక టీచర్ దారుణం

New Project (6)

New Project (6)

Harassment : దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రేమ వ్యవహరాల కారణంగా హత్యలు, ఆత్మహత్యలు, హత్యలు వంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు మరో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. సమాజంలో ఉపాధ్యాయుడికి గౌరవ స్థానం ఉంటుంది. అయితే అదే టీచర్ విద్యార్థినిని వేధించడం సంచలనం రేపింది.

రాజస్థాన్‌లోని బుండి జిల్లా దబ్లానా పోలీస్ స్టేషన్ పరిధిలో పాఠశాల విద్యార్థినిపై వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. సుమారు ఐదున్నర నెలల క్రితం, నిందితుడైన ఉపాధ్యాయుడు తన సొంత పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థినితో అసభ్యకర చర్యకు పాల్పడ్డాడు. అనంతరం బాధితురాలు ఫిర్యాదుతో పోలీస్‌స్టేషన్‌కు చేరుకోగా.. అతడు పారిపోయాడు. బాధితురాలి బంధువులు నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.

Read Also: Jio, Airtel, VI Super Plans: ఐపీఎల్ ఎంజాయ్ చేయండి.. డేటా అయిపోతుందన్న భయంవద్దు

ఈ కేసు డబ్లానాలోని ఓ పాఠశాలకు సంబంధించినది. గతేడాది అక్టోబరు 14న ఈ పాఠశాలలో చదువుతున్న 12వ తరగతి విద్యార్థిని ఉపాధ్యాయుడు అనిల్ నగర్‌పై వేధింపుల కేసు పెట్టింది. టీచర్ అనిల్ ఆమెను గదికి పిలిచి… తర్వాత బట్టలు తీసేయమని చెప్పి వేధించాడంతో భయపడి అక్కడి నుంచి పారిపోయానని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలు ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. ఆ తర్వాత బాధిత విద్యార్థిని కుటుంబసభ్యులతో కలిసి దబ్లానా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఉపాధ్యాయుడు అనిల్ నగర్‌పై కేసు నమోదు చేసింది. కేసు నమోదు చేసిన తర్వాత అనిల్ నగర్ పరారీలో ఉండడంతో పోలీసులు అతడి జాడ కనిపెట్టలేకపోయారు.

Read Also: Earthquake: జపాన్ లో భారీ భూకంపం.. నో సునామీ వార్నింగ్..

అప్పటి నుంచి అనిల్ నగర్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. అయితే ఎలాంటి క్లూ దొరకలేదు. నిందితుడిని అరెస్టు చేయకపోవడంతో నిందితుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల అలసత్వానికి నిరసనగా కలెక్టరేట్ వద్ద ఒకరోజు నిరసన దీక్షకు దిగారు. ఎట్టకేలకు డబ్లానా పోలీసులు అతని కోసం వెతికి, నిందితుడైన ఉపాధ్యాయుడు అనిల్ నగర్‌ను ఆదివారం అరెస్టు చేశారు. ఈ విషయమై పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.