NTV Telugu Site icon

Hrithik Roshan: సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకున్న హృతిక్ రోషన్ ?

New Project (47)

New Project (47)

Hrithik Roshan: ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో, డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. విభిన్నమైన పాత్రలతో అంతకుమించి అద్భుతమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరించడం లో ఆయన ఎప్పుడూ ముందుంటారు. అందుకే హృతిక్ నటించిన సినిమాలు వస్తున్నాయంటే ఒక పక్క బాలీవుడ్ ఆడియెన్స్ కే కాదు సౌత్ ఆడియన్స్ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హృతిక్ రోషన్ కి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే ఈయనకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా వెంటనే వైరల్ అవుతూ ఉంటుంది. అలాంటిది ఆయన సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకున్నారని, ఒక వార్త బయటకు రావడంతో ఈ విషయం కాస్త ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుప్పుమంది. అంతేకాదు ఈ విషయాన్ని స్వయంగా హృతిక్ స్వయంగా సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Read Also:2000rs Notes: ప్రజల వద్ద ఇప్పటికీ రెండు వేల నోట్లు.. రూ.7117 కోట్ల విలువ..

అసలు మేటర్ లోకి వెళితే తన సోషల్ మీడియా ఖాతా ద్వారా హృతిక్ రోషన్ “హ్యాపీ యానివర్సరీ పార్టనర్” అంటూ ఒక పోస్ట్ పెట్టడమే కాకుండా అందులో ఒక అమ్మాయి ఫోటోని కూడా జత చేశారు. ఆయన సుస్సానే ఖాన్ నుంచి విడిపోయిన తర్వాత సబా ఆజాద్ కి దగ్గరయ్యారు. గత కొంతకాలం నుంచి వీరిద్దరూ డేటింగ్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు పెళ్లి కూడా చేసుకుంటారన్న వార్తలు జోరుగా వినిపించాయి. ఇదిలా ఉండగా ఉన్నట్టుండి హృతిక్ ఒక పోస్ట్ పెట్టడం సంచలనం సృష్టిస్తోంది. హ్యాపీ యానివర్సిరీ పార్టనర్ అంటూ ఒక పోస్ట్ పెట్టడమే కాదు సబా ఆజాద్ తో కలిసి దిగిన ఫోటోని కూడా షేర్ చేశారు. పైగా ఇద్దరు వెకేషన్ లో ఉన్నప్పుడు తీసుకున్న ఫోటో కావడం గమనార్హం. దీంతో ఫోటో షేర్ చేయడం పక్కన ఉంచితే , పార్టనర్ అంటూ సంబోధించడం పైగా యానివర్సరీ కూడా చెప్పడంతో అందరిలో సందేహాలు మొదలయ్యాయి. ఇది అక్టోబర్ నెల. ఇప్పుడు యానివర్సరీ చెప్పాడంటే.. గత ఏడాది అక్టోబర్లో వీరు పెళ్లి చేసుకున్నారా అందుకనే హృతిక్ ఇలా అన్నాడా..? అందుకే ఈ విషెస్ చెబుతున్నాడా? అంటూ రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే గత అక్టోబర్ లోనే వీరి పెళ్లి జరిగి ఉండాలి అని కూడా కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.

Read Also:Jangaon Bathukamma: జనగామ బతుకమ్మకు వరల్డ్‌ బుక్‌ ఆఫ్ రికార్డులో చోటు

Show comments