How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
How to Grow Mint at Home from Cuttings: చలికాలంలో వేడివేడిగా ఏదైనా తింటున్నప్పుడు దానితో పాటు పుదీనా చట్నీ ఉన్నా, లేదా పెరుగన్నం, రాయతాలో కాస్త తాజా పుదీనా తురిమి వేసినా ఆ రుచే వేరు! పుదీనా మనం తినే తిండికి రెట్టింపు రుచినే కాదు, మంచి ఫ్రెష్‌నెస్ కూడా ఇస్తుంది. కానీ ఇంట్లో పుదీనా అయిపోగానే ప్రతీదానికీ మార్కెట్‌కి వెళ్లాల్సి వస్తుంది. కొన్నిసార్లు కాస్త ఎక్కువ పుదీనా తెస్తే, రెండు రోజుల్లోనే వాడిపోయి పాడైపోతుంది. మీకు కూడా ఇలాంటి అనుభవం ఎదురవుతోందా? అయితే ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే సులభంగా పుదీనా మొక్కను ఎలా పెంచుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
విశేషమేమిటంటే దీనికోసం విత్తనాలు కొనాల్సిన అవసరం లేదు, నర్సరీకి వెళ్లాల్సిన పనే లేదు. మార్కెట్ నుంచి తెచ్చిన ఒకే ఒక్క తాజా పుదీనా కాడ ఉంటే చాలు. ఎక్కువ శ్రమ పడకుండానే ఒక చిన్న కాడతో చలికాలం అంతటికీ సరిపడా తాజా పుదీనాను ఇంట్లోనే సొంతంగా పెంచేసుకోవచ్చు. అందుకోసం ముందుగా మార్కెట్ నుంచి తెచ్చిన పుదీనాలో మంచి ఆకుపచ్చగా, బలంగా ఉన్న కాడను ఎంచుకోవాలి. దానికి ఎలాంటి మచ్చలు, కుళ్లు లేదా పురుగులు ఉండకూడదు. సుమారు 10 నుంచి 15 సెంటీమీటర్ల పొడవున్న కాడ ఐతే సరిగ్గా సరిపోతుంది. ఈ కాడను ఒక గ్లాసు నీటిలో ముంచి ఉంచాలి. ఒక 7 నుంచి 10 రోజుల్లో దానికి చిన్న చిన్న తెల్లటి వేర్లు రావడం కనిపిస్తుంది. అలా వేర్లు రాగానే దాన్ని కుండీలోని మట్టిలో నాటుకోవాలి.
Also Read
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
పుదీనా వేగంగా అల్లుకుపోయే మొక్క, కాబట్టి దీన్ని కుండీలో పెంచడం చాలా తేలిక. దీనికి 8 నుంచి 12 అంగుళాల లోతు ఉన్న కుండీ సరైనది. నీళ్లు నిలిచిపోకుండా కింద ఖచ్చితంగా డ్రైనేజీ రంధ్రాలు ఉండాలి, లేదంటే వేర్లు కుళ్ళిపోతాయి. మట్టి విషయానికొస్తే.. తేమను పట్టి ఉంచుతూనే, ఎక్కువైన నీటిని బయటకు పంపేలా ఉండాలి. దీనికోసం 40% తోట మట్టి, 40% పశవుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్, 20% కొబ్బరి పొట్టు (కోకోపీట్) లేదా ఇసుక కలిపి మట్టి మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి. పుదీనాకు రోజంతా కాలుగోలే ఎండ అవసరం లేదు. ఉదయాన్నే ఒక 3 నుంచి 6 గంటల లేత ఎండ తగిలితే బాగా పెరుగుతుంది. ఆ తర్వాత కాస్త నీడ ఉన్న ప్రాంతంలో ఉంచితే మంచిది. ఇంట్లోని బాల్కనీ లేదా ఉదయం ఎండ పడే కిటికీ దగ్గర ఈ కుండీని పెట్టుకోవచ్చు. వెలుతురు బొత్తిగా లేకపోతే మొక్క బలహీనపడుతుంది, అలాగని మండుటెండ తగిలితే ఆకులు మాడిపోతాయి. కుండీలోని మట్టిలో తేమ ఉండాలి కానీ నీళ్లు నిల్వ ఉండకూడదు. పైన మట్టి ఆరిపోయినట్లు అనిపించినప్పుడే నీళ్లు పోయాలి. ఎక్కువ నీళ్లు పోస్తే వేర్లు పాడవుతాయి. మట్టిలో తేమ ఆరిపోకుండా ఉండటానికి దాని పైన ఎండిన ఆకులు లేదా గడ్డిని పలుచగా పరచవచ్చు.
మీ పుదీనా మొక్క బాగా దట్టంగా, పచ్చగా పెరగాలంటే ఒక చిన్న చిట్కా పాటించాలి. పైన వచ్చే కొత్త చిన్న చిన్న కొమ్మలను అప్పుడప్పుడు కట్ చేస్తూ ఉండాలి. ఒకవేళ పూలు వస్తుంటే వాటిని తెంపేయాలి. దీనివల్ల మొక్క శక్తంతా కొత్త ఆకులు, కొమ్మలు రావడానికే ఉపయోగపడుతుంది. మొక్క బాగా పెరిగాక ఆకుల కణుపు (లీఫ్ నోడ్) కి కాస్త పైన శుభ్రమైన కత్తెరతో కట్ చేసుకుంటే, అక్కడి నుంచే మరిన్ని కొత్త కొమ్మలు దట్టంగా వస్తాయి. ఇలా ఇంట్లో పెంచుకున్న తాజా పుదీనా కేవలం చట్నీలకే కాకుండా రాయతా, సలాడ్స్, హెర్బల్ టీ, వేడి వేడి స్నాక్స్‌లోకి అద్భుతంగా పనిచేస్తుంది. చలికాలంలో వేడివేడిగా వేసుకునే పరోటాలు, పకోడీలు, చాట్ లాంటి వాటిలో సొంతంగా పెంచిన తాజా పుదీనా ఆకులు కోసి వేసుకుంటే ఆ రుచే వేరు! కాబట్టి ఈసారి బజార్ నుంచి తెచ్చిన పుదీనా కాడలను పారేయకుండా, వెంటనే మొక్క నాటుకుంటే రోజూ తాజా పుదీనా ఉచితంగా మీ ముంగిట్లోనే ఉంటుంది!
తాజావార్తలు
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!