How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
How To Grow Black Pepper Plant In Pots: వంటగదిలో జీలకర్ర నుంచి బిర్యానీ ఆకు వరకు ఎన్నో రకాల మసాలా దినుసులు రుచిని పెంచడానికి వాడతాము. అందులో నల్ల మిరియాలకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. టీ పెట్టుకోవాలన్నా, కూరల్లో రుచి రావాలన్నా, లేదా చలికాలంలో వేడివేడిగా సూప్ తాగాలన్నా మిరియాలు తప్పనిసరి. కొద్దిగా మిరియాల పొడి వేస్తే చాలు, వంట రుచి పూర్తిగా మారిపోతుంది. సాధారణంగా అందరూ వీటిని మార్కెట్ నుంచే కొనుగోలు చేస్తుంటారు, కానీ మిరియాల మొక్కను మీ ఇంట్లోనే సులభంగా పెంచుకోవచ్చని మీకు తెలుసా? దీనికోసం పెద్ద తోటలు లేదా పొలాలు అవసరం లేదు, మీ బాల్కనీలో, టెర్రస్ మీద లేదా చిన్న గార్డెన్లోని కుండీలోనే ఈ తీగను హ్యాపీగా పెంచవచ్చు.
మీకు కూడా మొక్కలు పెంచే హాబీ ఉండి, కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకుంటే మిరియాల తీగ ఒక మంచి ఆప్షన్. అయితే దీన్ని నాటడానికి సరైన విత్తనాలు, మంచి మట్టి, కొద్దిగా శ్రద్ధ చాలా ముఖ్యం. ముందుగా కుండీలో మట్టిని సిద్ధం చేసుకోవాలి. కింద నీరు పోయేందుకు రంధ్రాలున్న మీడియం లేదా పెద్ద సైజు కుండీని ఎంచుకోవాలి. అందులో సాధారణ తోట మట్టి, కొద్దిగా ఇసుక, వర్మీకంపోస్ట్ కలిపి మట్టిని తయారు చేయాలి. దీనివల్ల మొక్కకు కావాల్సిన పోషకాలు అందుతాయి, ఎక్స్ట్రా నీరు సులభంగా బయటికిపోతుంది. మట్టిలో ఎప్పుడూ తేమ ఉండేలా చూసుకోవాలి కానీ నీరు నిలిచిపోకూడదు, లేదంటే వేర్లు కుళ్ళిపోతాయి. మార్కెట్లో దొరికే ఎండు మిరియాల గింజలు సాధారణంగా మొలకెత్తడానికి పనికిరావు, ఎందుకంటే వాటిని ప్రాసెస్ చేసి ఉంటారు. కాబట్టి విత్తనాలను నర్సింగ్ లేదా గార్డెనింగ్ స్టోర్ నుంచి తెచ్చుకోవాలి. కొత్తవారైతే నేరుగా నర్సరీ నుంచి రెడీగా ఉన్న చిన్న మొక్కను తెచ్చి నాటడం మరింత సులభం. విత్తనాలు నాటేటప్పుడు వాటిని మట్టిలో 1 నుంచి 2 సెంటీమీటర్ల లోతులో నాటి పైన తేలికపాటి మట్టి కప్పాలి. ఆ తర్వాత చేత్తో లైట్ గా నీళ్లు చల్లాలి. కుండీని ఎండ తగలకుండా వెచ్చదనం ఉండే ప్రదేశంలో ఉంచితే కొన్ని వారాల్లో మొలకలు వస్తాయి.
Also Read
- Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
- Kitchen Cleaning Tips: కిచెన్ సింక్లో నీళ్లు నిలిచిపోతున్నాయా? ఈ చిట్కాలతో సులభంగా క్లియర్ చేయండి!
- Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
మిరియాల మొక్క సాధారణ పొదలా పెరగదు, ఇదొక తీగ జాతికి చెందింది. కాబట్టి మొక్క పెరుగుతున్న కొద్దీ పైకి పాకడానికి కర్ర సహాయం లేదా చిన్న గ్రిల్ ఏర్పాటు చేయాలి. దీనివల్ల తీగ బాగా విస్తరించడానికి, చూసుకోవడానికి సులువుగా ఉంటుంది. అలాగే ఈ మొక్కకు ఉష్ణోగ్రత, తేమ వాతావరణం చాలా అవసరం. మధ్యాహ్నం వచ్చే తీవ్రమైన ఎండ నుంచి చిన్న మొక్కను కాపాడుకోవాలి. బాల్కనీలో ఎండ బాగా తగిలే, ఉక్కపోత ఎక్కువగా లేని సరైన చోటును ఎంచుకోవాలి. మట్టి పైపొర ఆరిపోయినట్లు అనిపిస్తేనే నీళ్లు పోయాలి, మరీ ఎక్కువగా నీళ్లు పోయడం మంచిది కాదు. మొక్క బాగా పెరిగి మంచి మిరియాలు కాయాలంటే ప్రతి 30 నుంచి 40 రోజులకు ఒకసారి వర్మీకంపోస్ట్ లేదా మంచి ఆర్గానిక్ ఎరువును అందించాలి. ఎరువు వేసిన తర్వాత మట్టిని కాస్త గుల్ల చేయాలి. అయితే, విత్తనం నుండి పెంచిన తీగకు కాయలు కాయడానికి కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది కాబట్టి కాస్త ఓపిక అవసరం. సరైన కేరింగ్ ఉంటే మీ బాల్కనీలోనే స్వయంగా మిరియాల తీగను పండించుకోవచ్చు.
తాజావార్తలు
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
IAS Officer Vikas Marmath: పబ్లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
-
Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా – ఆకృతి.. కారణం చెప్పిన నటి..
-
Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
ట్రెండింగ్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!