Site icon NTV Telugu

Hangover: హ్యాంగోవర్ తగ్గాలంటే ఈ పని చెయ్యండి..

Hangover

Hangover

రిలాక్స్ అయ్యేందుకు ఓ పెగ్ వేస్తే ఫరవాలేదని డాక్టర్లు చెబుతుంటారు. కానీ అదేపనిగా ఆల్కాహాల్ తాగితే మాత్రం ఆరోగ్యానికి హానికరమేనని వారు హెచ్చరిస్తుంటారు. రోజు అదేపనిగా మద్యం తాగితే హ్యాంగోవర్ వస్తుంది. హ్యాంగోవర్ అంటే మందు తాగిన తరువాత శారీరక, మానసిక ఇబ్బందులు వస్తాయి. ఇది ఓసారి వచ్చిందంటే తగ్గేందుకు చాలా టైం పడుతుంది. ఓసారి హ్యాంగోవర్ వచ్చిందంటే విపరీతమైన తలనొప్పితో నానా తిప్పలు పడాల్సిన పరిస్థితి వస్తుంది.

Read Also: Pawan Kalyan: 2024లో వైసీపీ ప్రభుత్వం ఉండదు, మన సర్కారే..

పెగ్ మీద పెగ్ వేశారా..? ఇక హ్యాంగోవర్ వస్తుంది. అటువంటి హ్యాంగోవర్‌ నుంచి రిలాక్స్ కలగాలంటే కొన్ని డ్రింక్స్ తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు. మద్యం ద్వారా వచ్చే ఇబ్బందుల నుంచి ఈ పానీయాలు ఉపశమనం కలిగించటమే కాదు ఆ సమస్యల నుంచి తొందరగా విముక్తి కలిగిస్తాయి. రాత్రి ఫుల్ గా మందుకొట్టి ఉంటే ఉదయం లేవటం లేట్ అవుతుంది. అలా ఆలస్యంగా లేచినప్పటి నుంచి ఈ హ్యోంగోవర్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. నిద్ర లేవటంతోనే తల పట్టుకుని ఇబ్బంది పడతారు. అబ్బా తలనొప్పి అంటూ ఏడుస్తారు. అలా హ్యోంగోవర్ సమస్యతో ఉన్నవారికి ఉదయం ఏమీ తినాలనిపించదు.

Read Also: Vijay Sethupathi: ‘మహారాజా”గా వస్తున్న ఉప్పెన విలన్..

కానీ అలా తినకుండా ఉండటం ఏమాత్రం మంచిదికాదని నిపుణులు చెబుతున్నారు. తప్పకుండా బ్రేక్ ఫాస్ట్ తినాలని సూచిస్తున్నారు. హ్యాంగోవర్ నుంచి బ్రేక్ ఫాస్ట్ ఉపశమనం కలిగిస్తుందని అంటున్నారు. రాత్రి అధికగా మద్యం తాగటం.. దాంతో బాగా లేట్ గా పడుకోవటంతో మెదడుకు, శరీరానికి రెస్ట్ ఉండదు. పైగా అధికంగా మద్యం సేవించడం వల్ల బాగా తలనొప్పి వస్తుంది. అటువంటి సమయంలో ఉదయం లేవగానే బ్రేక్ ఫాస్ట్ లో అరటిపండు, పీనట్స్‌ బట్టర్‌తో బ్రెడ్‌ తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇవి తలనొప్పి, అలసటను తొలగిస్తాయంటున్నారు.

Read Also: Fronx CNG: మారుతి సుజుకి ఫ్రాంక్స్ CNG లాంచ్.. ఏకంగా 28.51 కి.మీ మైలేజ్.. ధర ఎంతంటే..?

హ్యాంగోవర్ తగ్గాలంటే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే.. దీనివల్ల వికారం, వాంతులు వంటి సమస్యలు తగ్గిపోతాయి.
టీ, కాఫీలలో ఉండే కెఫిన్ శరీరాన్ని అప్రమత్తం చేసే ఉద్దీపనగా పనిచేస్తుంది. దీంతో హ్యాంగోవర్ నుంచి వచ్చే ఇబ్బందిని తగ్గిస్తుంది. శరీరాన్ని రిలాక్స్ గా ఉండేలా చేస్తుంది.

Exit mobile version