స్నానం అనేది శరీర పరిశుభ్రతను కాపాడేందుకు చేసే ఓ అలవాటు. చాలామంది ప్రతిరోజు స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదని అనుకుంటారు. కానీ, కొన్ని సందర్భాల్లో ప్రతిరోజు స్నానం చేయడం వల్ల అనేక దుష్ప్రభావాలు కూడా సంభవిస్తాయి. ముఖ్యంగా చర్మం, జుట్టు, రోగనిరోధక శక్తిపై దీని ప్రభావం కనిపించొచ్చు. మరి రోజూ స్నానం చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఒకసారి చూద్దాం.
చర్మం పొడిబారడం:
తరచూ వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మంలోని సహజ తేమ తగ్గిపోతుంది. ఇది చర్మాన్ని పొడిగా మార్చి, దురద మరియు ఎక్జిమా (Eczema) వంటి చర్మ సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా చల్లని వాతావరణంలో తరచూ స్నానం చేయడం వల్ల చర్మం మరింత పొడిబారుతుంది.
Read Also: Pak Vs NZ: పాకిస్తాన్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్..
సహజ నూనెలు తొలగిపోవడం:
మన శరీరం సహజంగా చర్మాన్ని రక్షించే నూనెలను ఉత్పత్తి చేస్తుంది. కానీ, ప్రతి రోజు సబ్బులు, బాడీ వాష్ వంటివి ఉపయోగించడం వల్ల ఈ సహజ నూనెలు తొలగిపోతాయి. దీని ఫలితంగా చర్మం రఫ్‌గా మారుతుంది. దానితో చర్మం మృదుత్వాన్ని కోల్పోతుంది.
జుట్టుకు నష్టం:
ప్రతిరోజు తలస్నానం చేయడం వల్ల జుట్టు సహజ తేమ కోల్పోయి పొడిబారిపోతుంది. ముఖ్యంగా వేడి నీటితో తలస్నానం చేయడం వల్ల జుట్టు కిందిలా మారి, త్వరగా రాలిపోవచ్చు. అందుకే, వారం లో 2-3 సార్లు మాత్రమే తలస్నానం చేయడం మంచిది.
రోగనిరోధక శక్తి తగ్గిపోవడం:
చర్మంపై సహజంగా కొన్ని రకాల బాక్టీరియా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడానికి సహాయపడతాయి. రోజూ స్నానం చేస్తూ ఎక్కువ సబ్బులు, కెమికల్స్ వాడటం వల్ల ఇవి పూర్తిగా తొలగిపోతాయి. దీని వల్ల మన రోగనిరోధక శక్తి తగ్గి, చిన్న చిన్న అలెర్జీలు, చర్మ సమస్యలు రావచ్చు.
Read Also: Nag Ashwin : కల్కి-2 ప్రారంభం అయ్యేది అప్పుడే.. నాగ్ అశ్విన్ క్లారిటీ
అధిక అలసట అనిపించడం:
తరచూ వేడి నీటితో స్నానం చేస్తే బీపీ (రక్తపోటు) తక్కువవ్వడం వల్ల బద్ధకం, అలసట పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా వృద్ధులలో, బీపీ సమస్యలు ఉన్నవారిలో మరింత ప్రభావం చూపించవచ్చు.
మరి ఎంతవరకు ప్రతిరోజు స్నానం ఆరోగ్యకరమని భావిస్తారంటే.. ఎక్కువగా చెమట పడే వారు, శారీరకంగా కష్టపడే వారు రోజూ స్నానం చేయడం మంచిది. అలాగే వేడి నీటితో కాకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది. ఎక్కువగా సబ్బులు, షాంపూలను వాడకుండా సహజమైన ఉత్పత్తులను ఉపయోగించుకోవడం ఉత్తమం. మొత్తానికి ప్రతిరోజూ స్నానం చేయడం ఆరోగ్యకరం అనిపించినా.. అతిగా స్నానం చేయడం వల్ల చర్మానికి, జుట్టుకి, ఆరోగ్యానికి కొంత నష్టం జరుగుతుంది. అందుకే, వాతావరణ పరిస్థితులు, శరీర అవసరాలను బట్టి స్నానపు అలవాట్లను మార్చుకోవడం ఉత్తమం.