స్నానం అనేది శరీర పరిశుభ్రతను కాపాడేందుకు చేసే ఓ అలవాటు. చాలామంది ప్రతిరోజు స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదని అనుకుంటారు. కానీ, కొన్ని సందర్భాల్లో ప్రతిరోజు స్నానం చేయడం వల్ల అనేక దుష్ప్రభావాలు కూడా సంభవిస్తాయి. ముఖ్యంగా చర్మం, జుట్టు, రోగనిరోధక శక్తిపై దీని ప్రభావం కనిపించొచ్చు. మరి రోజూ స్నానం చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఒకసారి చూద్దాం. చర్మం పొడిబారడం: తరచూ వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మంలోని సహజ తేమ…