రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ ఉపాధ్యాయుడు తన ఇంట్లో సమస్యలను దూరం చేసుకోవాలనుకున్నాడు. పరిష్కారం కోసం ఒక తాంత్రికుడి వద్దకు వెళ్లాడు. అయితే.. ఆ తాంత్రికుడు తన ఆస్తులన్నీ కాజేశాడు. దీంతో.. బాధితుడు ఆస్తులు, తన కుటుంబాన్ని రెండింటిని కోల్పోయాడు. కాగా.. ఈ ఘటనలో బాధితుడు భార్య సుష్మా దేవదా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాంత్రికుడు, అతని కుమారుడు సహా నలుగురిపై కేసు పెట్టింది. ఈ వ్యవహారం 2023లో మొదలు కాగా.. పోలీసులు విచారణ చేపట్టారు.
బాధితుడి భార్య పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. తన భర్త చేతన్‌రామ్ దేవదా ఇంటి సమస్యల కారణంగా మనస్తాపం చెంది తాంత్రికుడి వద్దకు వెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొంది. తాంత్రికుడు కాలు ఖాన్ అనే వ్యక్తి చేతబడి చేసేవాడని.. ఈ క్రమంలో.. తన ఇంటి సమస్యలను పోగొట్టాలని తాంత్రికుడికి చెప్పినట్లు సుష్మా దేవదా తెలిపింది. అయితే.. నీ కష్టాలన్నింటికి కారణం నీ ఆస్తే అని తాంత్రికుడు చెప్పాడు. దానిని అమ్మాలని సలహా ఇచ్చారు.
Andhra Pradesh: ఏపీలో పెరిగిన పోలీసుల నిఘా.. సమస్యాత్మక ప్రాంతాలపై డేగకన్ను
అయితే.. ఆ ఆస్తిని తన పేరు మీదకు బదిలీ చేయమని ఒప్పించారు. వివాదాలు పరిష్కరించిబడిన తర్వాత తిరిగి ఆస్తి ఇస్తానని తాంత్రికుడు హామీ ఇచ్చాడు. తాంత్రికుడు మాటలు నమ్మిన బాధితుడు తన 4,000 చదరపు అడుగుల ఆస్తిని 2023 జూలైలో కాలు ఖాన్ పేరుకు బదిలీ చేశాడు. కాగా.. కష్టాలు తీరకపోవడంతో చేతన్‌రామ్ దేవదా మళ్లీ తాంత్రికుడిని సంప్రదించాడు. తన ఆస్తి పత్రాలను తనకు తిరిగి ఇవ్వాలని తాంత్రికుడు కాలు ఖాన్‌ను కోరాడు. అయితే.. తాంత్రికుడు మాత్రం నీ ఆస్తిని నీకు తిరిగి ఇస్తే నీ కుటుంబంలో మరణం సంభవిస్తుందని చెప్పాడు. అంతేకాకుండా.. 1,200 చదరపు అడుగులకు పైగా ఉన్న ఇతర ఆస్తిని కూడా వారి పేరుకు బదిలీ చేయమని బాధితుడిని ఒప్పించాడు.
అయితే.. ఈ ఆస్తిని తాంత్రికుడు కాలు రామ్ బాధితుడికి తెలియకుండానే బీర్బల్, రామ్ కిషోర్ అనే వ్యక్తులకు రూ.24.91 లక్షలకు విక్రయించాడు. అయితే, ఈ వ్యవహారంలో చేతన్‌రామ్ దేవదాకు డబ్బులు అందలేదు. కాగా.. 2024 మే 17న ఆస్తిని కొన్న వ్యక్తులు చేతన్‌రామ్ ఇంటికి వెళ్లంగా ఈ వ్యవహారం బయటపడింది. సుష్మా దేవదాకు మొత్తం విషయం తెలిసింది. దీంతో.. ఆస్తి కాజేశారని ఆమె నలుగురిపై కేసు పెట్టింది. ఈ కేసులో పోలీసులు ఎవరిని అరెస్టు చేయలేదు.
