కరోనా వచ్చిందంటే చాలు.. అయినవారే సైడ్ అయిపోతున్నారు.. కోవిడ్ నుంచి కోలుకున్నా.. పలకరించే నాథుడే లేకుండా పోతున్నారు.. అయితే, ఓ యువతి మాత్రం.. కోవిడ్ ఇప్పుడు వస్తుంది పోతోంది.. పెళ్లి మాత్రం అనుకున్న ముహూర్తానికే చేసుకోవాలని పట్టుబట్టింది చివరకు అనుకున్న సమయానికి కోవిడ్ పాజిటివ్‌గా తేలిన యువకుడి.. అది కూడా.. కోవిడ్ వార్డులోని.. పీపీఈ కిట్లు ధరించి మరి పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఈ ఘటనలో కేరళలో వెలుగు చూసింది.. కైనంకరికి చెందిన శరత్ మాన్, అభిరామికి పెళ్లి కుదుర్చారు పెద్దలు.. ముహూర్తం ప్రకారం.. ఇవాళ పెళ్లి జరగాల్సి ఉండగా.. వారం రోజుల ముందే.. పెళ్లి కుమారుడు శరత్, అతని తల్లి కోవిడ్ బారినపడ్డారు.. దీంతో ఆ ఇద్దరు అలప్ఫూజా మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు.. అయితే, కాబోయేవాడు, అత్త కరోనా వార్డులో ఉన్నా.. అనుకున్న సమయానికి పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చిన వధువు అభిరామి.. తన ఆలోచనను ముందుగా కుటుంబసభ్యులకు తెలిపింది.. ఆ తర్వాత అంతా వెళ్లి జిల్లా కలెక్టర్ ముందు తమ ప్రతిపాదనను ఉంచారు.. ఇక, ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. కోవిడ్ వార్డే పెళ్లి మండపంగా మారిపోయింది.. పెళ్లి కూతురు అభిరామి పీపీఈ కిట్ ధరించి కోవిడ్ వార్డులోకి అడుగుపెట్టగా.. పెళ్లి కుమారుడు శరత్ తల్లి వారికి పూలదండలు అందజేయగా.. ఆ జంట కోవిడ్ వార్డులోనే దండలు మార్చుకుని ఒక్కటయ్యారు..