Site icon NTV Telugu

Crime News: సినిమా స్టోరీకి మించిన కథ.. దోపిడీ ముసుగులో భార్యను కిరాతకంగా చంపించిన భర్త!

Apcrime

Apcrime

Crime News: మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లాలో ఒక సినిమా స్టోరీకి మించిన దారుణ ఘటన వెలుగుచూసింది. సెప్టెంబర్ 21న అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది. మొదట్లో ఇది దోపిడీ హత్యలా కనిపించినా.. చివరికి భర్తే అని తెలిసి అందరి గుండెల దడ పుట్టించింది. మరి ఈ హత్య గల పూర్తి వివరాలను చూస్తే..

పద్మనగర్ థానా పరిధిలోని డిగరిస్ గ్రామంలో మహిళపై రాత్రివేళ దాడి జరిగింది. ఆ దాడిలో భర్తకు స్వల్ప గాయాలు కాగా, భార్యను కత్తులతో 40 సార్లకు పైగా పొడిచి దారుణంగా చంపేశారు. ఈ ఘోరానికి నేరుగా భర్తే సూత్రధారి అని పోలీసు విచారణలో బయటపడింది. పోలీసుల సమాచారం ప్రకారం.. నిందితులు టెలివిజన్‌లోని క్రైమ్ పేట్రోల్ వంటి క్రైమ్ షోలు చూసి ఈ హత్యా ప్రణాళికను రూపొందించారు. భర్త మహేంద్ర, తన స్నేహితులు హేమంత్ అలియాస్ కాన్హా, ఆర్యన్, రాజేంద్రలతో కలసి ఈ హత్యను అమలు చేయించాడు. భార్యను చంపించడానికి భర్త ఒక లక్ష రూపాయల సుపారీ ఇచ్చాడని హేమంత్ విచారణలో ఒప్పుకున్నాడు.

bike riders dangerous stunts: అరేయ్… ఏంట్రా ఇది.. ఫేమస్ అవ్వడం కోసం ఎంతకైనా తెగిస్తారా..

మహేంద్ర, హత్యకు రెండు రోజుల ముందు తన ఫోన్ పోయిందని ఇంట్లో చెప్పి కుటుంబాన్ని తప్పుదారి పట్టించాడు. అదే విధంగా ఘటన రోజు రాత్రి సమయంలో.. కడుపు నొప్పి వస్తోందని చెప్పి భార్యను తనతో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ మధ్యలోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో మిత్రులు దాడి చేసి భార్యను కత్తిపోట్లు పొడిచి చంపేశారు. భర్తకు తేలికపాటి గాయాలు మాత్రమే కలిగించగా, మొత్తం సన్నివేశం దోపిడీలా కనిపించేలా నటించారు.

పోలీసులు విచారణలో వైద్యులను సంప్రదించగా.. మహేంద్రకు ఎలాంటి కడుపు నొప్పి లేదని తేలింది. దీంతో పోలీసులు అతడిపైనే అనుమానం వ్యక్తం చేశారు. ఇక విచారణలో హేమంత్ నేరాన్ని ఒప్పుకోవడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. నిందితులు హత్యకు కావాల్సిన కత్తులు, గ్లౌజులు ఖండ్వాలోనే కొనుగోలు చేసినట్లు కూడా బయటపడింది. పోలీసుల ప్రకారం, మహేంద్ర తన రెండో భార్య అయిన మృతురాలితో తరచూ విభేదాలు జరిగేవని తేలింది. భార్య తిట్లు తిట్టడం, కుటుంబ సభ్యులతో సరిగ్గా ప్రవర్తించకపోవడం కారణంగా విసిగి, ఈ హత్యా ప్రణాళిక రూపొందించినట్లు హంతకుడు చెప్పినట్లు సమాచారం. సుపారీ ఇచ్చిన ఆధారాలు, అడ్వాన్స్‌గా చెల్లించిన 10 వేల రూపాయలు, హత్యలో ఉపయోగించిన కత్తులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

PAK vs SL: మెరిసిన షాహీన్ అఫ్రిది.. పాకిస్థాన్ ముందు స్వల్ప లక్ష్యం!

దీనితో ఈ కేసులో ప్రధాన నిందితుడు భర్త మహేంద్రతో పాటు హేమంత్, ఆర్యన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు రాజేంద్ర ప్రస్తుతం పరారీలో ఉండగా, అతడి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ కేసును ఛేదించిన పోలీసు బృందానికి ఖండ్వా ఎస్పీ మనోజ్ కుమార్ రాయ్ నగదు బహుమతి ప్రకటించారు.

Exit mobile version