China Pig: చైనాలో షాకింగ్ ఘటన… పంది పైనే అనుమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China Pig: చైనాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పందిని చంపేందుకు ప్రయత్నించిన కసాయి విగతజీవిగా మారాడు. తనను చంపేందుకు ప్రయత్నించిన కసాయిపై పెంపుడు పంది తిరగబడి దాడి చేసింది. ఎలక్ట్రిక్ గన్‌తో పడగొట్టిన తరువాత, పంది స్పృహలోకి వచ్చి కసాయిపై దాడి చేసింది. ప్రమాదంలో 61 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. హాంకాంగ్‌లోని ఓ కబేళాలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిన్న మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో షెయుంగ్ షుయ్ స్లాటర్‌హౌస్‌లో ఈ ప్రమాదం జరిగింది. కబేళాలో ఉపయోగించే పద్ధతి… ఎలక్ట్రిక్ గన్‌తో స్టన్ చేసి, ఆపై కత్తితో చంపడం. మరణించిన వృద్ధుడు కూడా ఇదే పద్ధతిని అనుసరించాడు. అతను ఎలక్ట్రిక్ స్టన్ గన్‌తో నుదుటిపై కాల్చి పందిని అపస్మారక స్థితిలో పడేశాడు.
Read Also: Arvind Dharmapuri : ప్రశాంత్ రెడ్డిపై ఎంపీ అరవింద్ తిట్లపురాణం
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
కానీ పంది స్పృహలోకి వచ్చి అతని వైపు పరుగెత్తింది. అతని చేతిలోని సుమారు ఒకటిన్నర అడుగుల పొడవాటి కొడవలితో పందిని పొడిచాడు. కబేళాకు చెందిన మరో ఉద్యోగి వచ్చేసరికి అతని ఎడమ కాలికి కత్తి తగిలి ఉంది. ఆ కసాయి మైదానంలో అపస్మారక స్థితిలో కనిపించాడు.. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు. మృతికి గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదని, ఘటనపై కార్మిక శాఖ విచారణ ప్రారంభించిందని పోలీసులు తెలిపారు.
Read Also:Pawan Kalyan varahi : రేపు కొండగట్టుకు వారాహి.. పూజల అనంతరం రోడ్డెక్కనున్న వాహనం
మరణించిన కార్మికుడి కుటుంబాన్ని ఆదుకుంటామని కార్మిక శాఖ ప్రకటించింది. ఈ ఘటనపై త్వరలోనే విచారణ పూర్తి చేసి మృతికి గల కారణాలను వెలికితీస్తామని పోలీసులు తెలిపారు. పని పరిసరాల్లో ఉద్యోగుల భద్రతను పెంచాలని అధికారులను డిమాండ్ చేశారు కార్మికులు. లేబర్ డిపార్ట్‌మెంట్ కూడా భద్రతా లోపమా అనే కోణంలో దర్యాప్తు చేస్తోంది. కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రపంచంలోని అతిపెద్ద మాంసం వినియోగదారులలో హాంకాంగ్ ఒకటి. హాంకాంగ్‌లు సగటు బ్రిటన్‌తో పోలిస్తే రోజుకు నాలుగు రెట్లు ఎక్కువ మాంసాన్ని తింటారని అంచనా. పంది మాంసం, గొడ్డు మాంసం హాంకాంగ్ ప్రజలకు ఇష్టమైన మాంసం వంటకాలు.
తాజావార్తలు
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!