హనీ రోజ్.. ఈ పేరుకు యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ మించిన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.. సినిమాల్లో పెద్దగా కనిపించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. ఆ ఫోటోలు ఎంతగా వైరల్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం.. తాజాగా బ్లాక్ ట్రెండీ వేర్ లో అదిరిపోయే పోజులు ఇచ్చింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతున్నాయి..
బాలయ్య వీరసింహరెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ అమ్మడు ఆ సినిమా సూపర్ హిట్ అయిన మరో సినిమాను ప్రకటించలేదు.. గ్లామర్ పరంగా కూడా తిరుగులేకపోవడంతో అభిమానులు ఆమెకి ఫిదా అవుతున్నారు. హనీ రోజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తుంది.. రోజు రోజుకు అందాల డోస్ పెంచుతుంది..
తాజాగా ఎంతో అందంగా ఉన్న ట్రెండీ అవుట్ ఫిట్ లో మెరిసింది. హనీ రోజ్ తన సొగసుతో మాయ చేసే విధంగా ఫోజులు ఇస్తోంది.. బ్లాక్ స్లీవ్ టైట్ డ్రెస్సులో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ అమ్మడు ఎలాంటి డ్రెస్సులు వేసినా ఆ డ్రెస్సులకే అందాన్ని తెచ్చేలా ఉంటుంది. అలాంటి ఈ అమ్మడు తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.. మరి ఏ హీరో సినిమాతో వచ్చేస్తుందో చూడాలి..