Honda Cars India: హోండా కార్స్ ఇండియా (Honda Cars India) తన మోడల్ రేంజ్ మొత్తం మీద ధరల పెంపును ప్రకటించింది. ఈ ధరల సవరణ జనవరి 2026 నుంచి అమల్లోకి రానుంది. ముడి పదార్థాల ఖర్చులు, ఆపరేషనల్ వ్యయాలు పెరగడం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. గత కొన్ని నెలలుగా కస్టమర్లపై భారం తగ్గించేందుకు ఈ ఖర్చులను తామే భరిస్తూ వచ్చామని.. అయితే ఇకపై ధరల పెంపు తప్పదని కంపెనీ తెలిపింది. అయితే ధరలు ఎంత మేర పెరుగుతాయో మాత్రం వెల్లడించలేదు.
Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్, 200MP లైకా కెమెరాతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర ఎంతంటే..?
నిజజానికి ఏడాది మారె సమయంలో అనేక తయారీ సంస్థలు ఇదే విధంగా ధరలను పెంచడం సాధారణమే. హోండా కార్ల ధరల పెంపుతో పాటు వాహనాల స్పెసిఫికేషన్లు లేదా ఫీచర్లలో ఎలాంటి మార్పులు ఉండవు. మరోవైపు 2025 స్టాక్‌ను క్లియర్ చేయడానికి డీలర్‌షిప్‌ల వద్ద పరిమిత డిస్కౌంట్లు ఇవ్వొచ్చని అంచనా. కాబట్టి కొత్త హోండా కారు కొనాలనుకునే వారికి ఇది సరైన సమయం. ఈ ధరల పెంపు ప్రజాధారణ పొందిన హోండా అమేజ్, హోండా సిటీ, హోండా ఎలేవేట్, హోండా సిటీ హైబ్రిడ్ వంటి బడ్జెట్ కార్లపై ప్రభావితం చేయనున్నాయి.
