NTV Telugu Site icon

Honda Amaze 2024: హోండా కొత్త ‘అమేజ్‌’ వచ్చేసింది.. లీటర్‌కు రూ.19.46 కిమీ ప్రయాణం!

Honda Amaze 2024

Honda Amaze 2024

హోండా కార్స్ ఇండియా బుధవారం కొత్త అమేజ్‌ 2024ను లాంచ్‌ చేసింది. మూడో తరానికి చెందిన ఈ అమేజ్‌ ప్రారంభ ధర రూ.8 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) కంపెనీ నిర్ణయించింది. టాప్ వేరియంట్ ధర రూ.10.90 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉంది. కొత్త అమేజ్‌ డిజైన్‌, ఫీచర్ల పరంగా పలు మార్పులతో వచ్చింది. అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌ (ఏడీఏఎస్)ను ఇందులో ఇచ్చారు. మొదటి తరం మోడల్ ఏప్రిల్ 2013లో మార్కెట్‌లోకి రాగా.. రెండవ తరం మే 2018లో వచ్చింది. ఇప్పటి వరకు దాదాపు 5.80 లక్షల యూనిట్లను విక్రయించింది. భారతదేశంలో హోండా అమ్మకాల్లో అమేజ్ వాటా 40 శాతంగా ఉండడం విశేషం.

హోండా అమేజ్‌ మూడు వేరియంట్లలో (వీ, వీఎక్స్‌, జడ్‌ఎక్స్‌) అందుబాటులో ఉంది. అమేజ్‌ ఎంట్రీ లెవల్‌ వేరియంట్‌ రూ.7.99 (ఎక్స్‌ షోరూమ్‌)గా.. జడ్‌ఎక్స్‌ వేరియంట్‌ ధరను రూ.10.90 లక్షలుగా ఉంది. ఈ కారులో 1.2 లీటర్‌ ఫోర్‌ సిలిండర్‌ ఐ-వీటెక్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను ఇచ్చారు. ఇది 89 బీహెచ్‌పీ పవర్‌, 110 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ లీటర్‌కు 18.65 కిమీ మైలేజ్‌.. సీవీటీ వేరియంట్‌ రూ.19.46 కిమీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. మారుతి సుజుకి డిజైర్, హ్యుందాయ్ ఔరా, టాటా టిగోర్‌లకు కొత్త అమేజ్‌గట్టి పోటీ ఇవ్వనుంది.

హోండా అమేజ్‌ ముందువైపు డీఆర్‌ఎల్స్‌, టర్న్‌ ఇండికేటర్లతో కూడిన ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్స్‌, ఎల్‌ఈడీ ఫాంగ్‌ ల్యాంప్స్‌ ఉన్నాయి. వెనుక వైపు ఎల్‌ఈడీ టెయిల్‌ ల్యాంప్స్‌ను ఇచ్చారు. 15 ఇంచెస్ డ్యూయల్‌ టోన్‌ అలాయ్‌ వీల్స్‌ ఉన్నాయి. 8 ఇంచెస్ ఫ్లోటింగ్‌ టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ను ఇవ్వగా.. అది యాపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటోకు సపోర్ట్‌ చేస్తుంది. వైర్‌లెస్‌ ఛార్జర్‌, రియర్‌ ఏసీ వెంట్స్‌, ఎయిర్‌ ప్యూరిఫైర్‌, ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, వాక్‌ అవే ఆటోలాక్‌.. వంటి ఫీచర్స్ ఉన్నాయి. కొత్త అమేజ్‌ ఆరు ఎయిర్‌ బ్యాగులు, రియర్‌ పార్కింగ్‌ సెన్సర్‌ వంటి సదుపాయాలతో వచ్చింది.

Also Read: IND vs AUS 2nd Test: భారత్, ఆస్ట్రేలియా డే/నైట్ టెస్ట్.. సెషన్ టైమింగ్స్ ఇవే!

హోండా అమేజ్‌ ధరలు:
అమేజ్ V MT – రూ. 8 లక్షలు
అమేజ్ V CVT – రూ. 9.20 లక్షలు
అమేజ్ VX MT – రూ. 9.10 లక్షలు
అమేజ్ VX CVT – రూ. 10 లక్షలు
అమేజ్ ZX MT – రూ. 9.70 లక్షలు (ఏడీఏఎస్)
అమేజ్ ZX CVT – రూ. 10.90 లక్షలు

 

Show comments