NTV Telugu Site icon

China: చైనా వింత నిర్ణయం.. ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న విద్యార్థుల కోసం ఆస్పత్రిలోనే ‘ హోమ్ వర్క్ జోన్స్’

China

China

China: చైనాలో మిస్టరీ వ్యాధి ప్రబలుతోంది. న్యూమోనియాతో అక్కడి పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. చాలా మంది అనారోగ్యంతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. వ్యాధి విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. చైనా నుంచి మరింత సమాచారం కావాలని కోరింది. అయితే సాధారణంగా వచ్చే సీజనల్ వ్యాధులే అని చైనా ప్రభుత్వం చెప్పింది.

ఇదిలా ఉంటే చైనా తీసుకుంటున్న చర్యలు అక్కడ ప్రజాగ్రహానికి కారణమువతున్నాయి. ఆస్పత్రుల్లో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో అనారోగ్యం బారిన పడిన విద్యార్థుల కోసం ‘‘ హోమ్‌వర్క్ జోన్స్’’ ఏర్పాటు చేయడం ప్రారంభించింది. దీనిపై అక్కడి ప్రజలు సోషల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. పిల్లలు అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా స్కూల్ హోమ్‌వర్క్ చేయడానికి ఒత్తిడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు నేర్చుకోవాలనే విద్యార్థులకు ఇవి సహాయంగా ఉంటాయని మరికొందరు వాదించారు. విద్యార్థులు చదువుల్లో వెనకబడి ఉండకుండా ఇవి ఉపయోగపడుతాయని వాదిస్తున్నారు.

Read Also: Mahesh Babu: యానిమల్ కి ప్లస్ అవుతాడని బాబుని తీసుకొస్తే చివరికి బాబే మైనస్ అయ్యాడే?

స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. విద్యార్థులు అనారోగ్యంతో ఉన్నప్పుడు చదువుకోవడానికి తూర్పు చైనాలోని ఆసుపత్రులలో డెస్క్‌లు, కుర్చీలు మరియు ఇన్ఫ్యూషన్ స్టాండ్‌లు ఏర్పాటు చేస్తున్నారని తెలిపింది. తల్లిదండ్రులు తమ పిల్లలకు వారి పాఠశాల పనుల్లో సహాయం చేస్తున్నారు. ఆస్పత్రులు అనారోగ్యం నుంచి కోలుకోవడంతో పాటు నేర్చుకోవాలనే పిల్లలకు మంచి వాతావరణాన్ని అందిస్తున్నాయని నివేదించింది.

చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రతినిధి, మి ఫెంగ్ఆదివారం మాట్లాడుతూ.. తీవ్రమైన శ్వాసకోశ వ్యాధుల పెరుగుదలకు అనేక వ్యాధి కారకాలు కారణమవుతున్నాయని, ముఖ్యంగా ఇన్‌ఫ్లూఎంజా వ్యాప్తి కారణంగా పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పారు. 2019లో చైనా నగరమైన వూహాన్‌‌లో కోవిడ్-19 మహమ్మారి బయటపడింది. ఈ నేపథ్యంలో చైనాలో వెలుగు చూస్తున్న కొత్త వ్యాధి మరోసారి ప్రపంచాన్ని భయపెడుతోంది.