బీసీసీఐ (BCCI) టీమిండియా హోమ్ సీజన్ షెడ్యూల్ ప్రకటించింది. 2024-25లో భారత క్రికెట్ జట్టు 3 జట్లతో 5 సిరీస్లు ఆడనుంది. అందులో రెండు టెస్ట్ సిరీస్లు, రెండు టీ20 సిరీస్లు, ఒక వన్డే సిరీస్ ఉన్నాయి. ఈ క్రమంలో.. బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు భారత్ లో పర్యటించనున్నాయి. ఇండియా స్వదేశ షెడ్యూల్ సెప్టెంబర్ 2024 నుండి ప్రారంభమవుతుంది. బంగ్లాదేశ్తో రెండు టెస్ట్ల సిరీస్తో పాటు మూడు టీ20ల సిరీస్ భారత్ ఆడనుంది. ఆ తర్వాత.. అక్టోబర్, నవంబర్ లో భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ జరుగనుంది. ఆ తర్వాత.. జనవరి, ఫిబ్రవరిలో భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్ జరుగనుంది.
kalki 2898 AD: ట్రైలర్ 2 లీక్.. మాటల్లేవ్ అంతే!
సెప్టెంబర్ లో రెండు మ్యాచ్ ల టెస్ట్ బంగ్లాదేశ్ తో ప్రారంభం కానుంది. ఆ తర్వాత.. మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఉండనుంది. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్ట్ కు చెన్నై ఆతిథ్యం ఇవ్వగా.. సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ రెండో టెస్ట్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఆ తర్వాత.. ధర్మశాల, ఢిల్లీ, హైదరాబాద్ లలో మూడు టీ20 మ్యాచ్ లు జరుగనున్నాయి. ఆ తర్వాత.. న్యూజిలాండ్ తో మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ జరుగుతుంది. మొదటి టెస్ట్ అక్టోబర్ 16 నుండి బెంగళూరులో ప్రారంభమవుతుంది. రెండో టెస్ట్ పూణె, మూడో టెస్ట్ ముంబైలో జరుగనుంది. 2025లో భారత్-ఇంగ్లండ్ మధ్య వైట్ బాల్ సిరీస్ జరుగనుంది. అందులో 5 టీ20 ఇంటర్నేషనల్, 3 వన్డే మ్యాచ్ లు ఉన్నాయి. ఆ తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఉండనుంది. ఆ తర్వాత ఐపీఎల్ 2025 ఉంటుంది. ఆ తర్వాత.. ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఆడనుంది.
International Yoga Day 2024: బరువు తగ్గాలనుకునే వాళ్లు ఈ అయిదు ఆసనాలు ట్రై చేయండి
టీమిండియా హోం సీజన్ షెడ్యూల్:
సెప్టెంబర్ 19 నుండి 23 సెప్టెంబర్ వరకు- భారత్ vs బంగ్లాదేశ్, మొదటి టెస్ట్ (చెన్నై)
సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 1 వరకు- భారత్ vs బంగ్లాదేశ్, రెండో టెస్ట్ (కాన్పూర్)
అక్టోబర్ 6- భారత్ vs బంగ్లాదేశ్, మొదటి టీ20 (ధర్మశాల)
అక్టోబర్ 9- భారత్ vs బంగ్లాదేశ్, రెండో టీ20 (ఢిల్లీ)
అక్టోబర్ 12- భారత్ vs బంగ్లాదేశ్, మూడవ టీ20 (హైదరాబాద్)