NTV Telugu Site icon

Vizag: మహిళలతో కలిసి శారీ వాక్‌ చేసిన హోం మంత్రి వంగలపూడి అనిత

Vangalapudi Anitha

Vangalapudi Anitha

Vizag: విశాఖలోని బీచ్‌ రోడ్డులో హ్యాండ్లూం శారీ వాక్‌ కలర్‌ఫుల్‌గా జరిగింది. సూర్యోదయం కాగానే వేలాది మహిళలతో చేపట్టిన శారీ వాక్ సంప్రదాయాలను చాటి చెప్పింది. ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భారీగా మహిళలు పాల్గొన్నారు. ఈ శారీ వాక్‌ను హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. మంత్రి కూడా వైజాగ్‌ మహిళలతో కలిసి శారీ వాక్ చేశారు.

చీరకట్టడం మన సాంప్రదాయమని.. చీరలో అమ్మతనం, కమ్మతనం ఉంటుందని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. చీర అనే సరికీ గుర్తుకు వచ్చేది అమ్మ అంటూ.. చీర గొప్పదనం గురించి చెప్పారు. భావితరాలు ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలని మంత్రి తెలిపారు. చీర నేచేటప్పుడు చేనేత కార్మికులకు కష్టం ఉంటుందని.. చేనేత కార్మికులు ఇప్పటికి చాలా ఇబ్బందులు పడుతున్నారని మంత్రి చెప్పుకొచ్చారు. చేనేత కార్మికులను కాపాడుకోవాలని మహిళలకు సూచించారు. ఒక చీర నేయడానికి దాదాపుగా ఇరవై రోజులు పడుతుందని ఆమె నేతన్నల కష్టాలు గురించి మాట్లాడారు. చిన్నపాటి వర్షాలు వచ్చినా చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు.

 

Show comments