NTV Telugu Site icon

Vangalapudi Anitha: పవన్ కళ్యాణ్ భద్రతపై ఆగ్రహం వ్యక్తం చేసిన హోంమంత్రి

Pawan Kalyan

Pawan Kalyan

Vangalapudi Anitha: విజయనగరం జిల్లాలో నకలీ ఐపీఎస్ అధికారి గురించి ఎన్‌టీవీలో ప్రసారమైన వార్తలకు హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఈ వార్తపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తక్షణమే విచారణకు ఆదేశించారు. అలాగే, వై కేటగిరీ భద్రతలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క మన్యం పర్యటనలో భద్రతా లోపం గుర్తించడంతో.. ఈ విషయం గురించి హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగిన బలివాడ సూర్యప్రకాశరావు ఐపీఎస్ యూనిఫాంలో ఉన్న అధికారికి సెల్యూట్ కొట్టి, ఫోటోలు దిగిన సంఘటనను నిరసిస్తూ ఈ ఘటనపై విచారణ చేపట్టాలని ఆదేశించారు.

Also Read: Manmohan Singh: కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న మన్మోహన్ సింగ్ భౌతికకాయం

ఈ ఘటన పై హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ భద్రతలో జరుగుతున్న లోపాలను దర్యాప్తు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ ఘటన పట్ల స్థానికంగా కలకలం రేగింది. నకలీ ఐపీఎస్ అధికారి వ్యవహారం, భద్రతా లోపం తదితర అంశాలు బహుళ చర్చలకు దారి తీసాయి.

Show comments