NTV Telugu Site icon

New SP office: వనపర్తిలో కొత్త ఎస్పీ ఆఫీస్ ను ప్రారంభించిన హోంశాఖ మంత్రి

Wanaparthy

Wanaparthy

వనపర్తి జిల్లా నూతన ఎస్పీ కార్యాలయాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్ముద్ ఆలీ ప్రారంభించారు. మహమ్ముద్ ఆలీ వెంట మంత్రి నిరంజన్ రెడ్డి.. డీజీపీ అంజన్ కుమార్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. ఈరోజు ఎంతోగర్వించదగ్గ విషయం అని పేర్కొన్నారు. 2014 సికింద్రాబాద్ లో మొట్టమొదట కేసీఆర్ లాఅండ్ ఆర్డర్ గురించి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారని ఆయ గుర్తు చేసుకున్నారు. లాఅండ్ ఆర్డర్ లో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని డీజీపీ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోలీస్ కార్యాలయాలు రాష్ట్రాల అన్నింటికీ ఆదర్శం.. ఇది ఎంతో బాధ్యత కలిగిన విషయం అని అన్నారు. వనపర్తి ఎస్పీ రక్షిత చాలా డైనమిక్ ఆఫీసర్.. సీఎం కేసీఆర్ ప్రజల వద్దకు లాఅండ్ ఆర్డర్ అందుబాటులోకి తెచ్చాడు అని అన్నారు.

Also Read : TSPSC: టీఎస్‌పీస్సీ పేపర్‌ లీకేజీలో మరో కోణం.. చాట్‌ జీపీటీతో ఏఈఈ పరీక్ష

మంత్రి మహమ్ముద్ ఆలీ కామెంట్స్.. మంత్రి నిరంజన్ రెడ్డి ఎంతో విలువలు కలిగిన వ్యక్తి అని ఆయన అన్నారు. డీజీపీ అంజనీ కుమార్ లా అండ్ ఆర్డన్ ను కంట్రోల్ చేయగలిగే గొప్ప ఆఫీసర్ అని హోంమంత్రి మమ్మద్ ఆలీ పేర్కొన్నారు. తెలంగాణ వచ్చే ముందు రాష్ట్రం వస్తుందా అనే అనుమానాలు ఎన్నో వుండేవి.. కానీ కేసీఆర్ పట్టుదలతో రాష్ట్రం సాధించి పెట్టాడు.. రాష్ట్రం ఇచ్చాక వెనుకబడిన ప్రాంతాన్ని ఎలా అభివృద్ది చేస్తారని చాలా మంది అడిగారు.. కానీ నేడు దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూస్తుంది అని హోంశాఖ మంత్రి మహ్మద్ ఆలీ అన్నారు.

Also Read : India’s Defence Exports: ఇది భారత్ సత్తా.. ఆల్‌టైం హైకి రక్షణ ఎగుమతులు..

సీఎం కేసీఆర్ పోలీసులకు అధికారంతో పాటు వారి డిపార్ట్మెంట్ కు ఎన్నో నిధులు కేటాయించారని హోంశాఖ మంత్రి మహ్మద్ ఆలీ అన్నారు. కేసీఆర్ మహిళల రక్షణ కోసం షీటీమ్స్ ఏర్పాటు చేసారు.. క్రైమ్ ను కంట్రోల్ చేయడంలో తెలంగాణ పోలీస్ వ్యవస్థ సక్సెస్ అయ్యింది. కేసీఆర్ మాకు దేవుడిచ్చిన వరం.. తెలంగాణను బంగారు తెలంగాణ చేసేందుకు ఆయన చేసిన కృషి మరువరేనిది అంటూ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నో అభివృద్ది పథకాల ద్వారా కేసీఆర్ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నాడు అని హోంమంత్రి తెలిపాడు.

Also Read : Merugu Nagarjuna: మేనిఫెస్టోని అమలు చేసిన ఘనత జగన్‌ది.. చంద్రబాబులా మాయం చేయలేదు

మంత్రి నిరంజన్ రెడ్డి కామెంట్స్.. వందేల్ల ప్రణాళికను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ సచివాలయాన్ని సీఎం కేసీఆర్ నిర్మించారు. ఇతర రాష్ట్రాల ఐఎస్, ఐపీఎస్ లు సైతం తెలంగాణ రాష్ట్ర ఐఎస్ ఐపీఎస్ నూతన భవనాలవైపు చూస్తున్నారు అని అన్నారు. ఈరోజు ఇలాంటి కార్యాలయాలు రూపుదిద్దు కోవడం గర్వించదగ్గ విషయం అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తికి ప్రతీక ఫ్రభుత్వ ఫాలిటెక్నిక్ కళాశాల రాజగారి భవనం శిథిలావస్థకు చేరుకున్నది.. ఆ భవనానికి తిరిగి పూర్వ వైభవే తీసుకువస్తా.. ఈరోజు ఏర్పాటు చేసుకున్న కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు ప్రకృతి ఒడిలో సేదతీరుతున్నాయి.. కొత్త నిర్మాణాలు ప్రజల అభ్యునతికి ఉపయోగపడాలి.. రాజకీయంగా బిన్నాభి ప్రాయలు వుండవచ్చు కాని సంస్కార హీనంగా మాట్లాడొద్దు అంటూ ఆయన అన్నాు.

Also Read : Manipur Violence: మణిపూర్ హింసాకాండలో చనిపోయిన వారికి రూ.10లక్షలు.. ఇంటికో ఉద్యోగం

ప్రజలను రెచ్చగొట్టే వీధంగా అగాధాలను సృష్టించకూడదు అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈజిల్లాల్లో ఉన్న ప్రజలంతా రాజకీయాలతీతంగా అందరిని సమానంగా చూస్తాం.. అప్రజాస్వామిక విషయాలను పోలీస్ వ్యవస్థ చాలా సీరియస్ గా తీసుకోవాల్సిందే.. ప్రాణం పోయిన న్యాయం వైపే వుంటాను అని నిరంజన్ రెడ్డి అన్నారు. మహమ్ముద్ ఆలీ గారు నాకు సొంత సోధరుడితో సమానం.. ఆయన కృషితో ఇంత మంచి ఎస్పీ ఆఫీస్ ను నిర్మించుకున్నాము అని మంత్రి పేర్కొన్నారు.

Show comments